Effective Hair Fall Solution: జుట్టు రాలటం తగ్గటం లేదా..? ఆపిల్ సైడర్ వెనిగర్ వాటర్ తో 12 రోజుల్లో చెక్ పెట్టొచ్చు
Apple Cider Vinegar for Hair Fall Solution: హెయిర్ ఫాల్ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా జుట్టుకు యాపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ వాటర్ వినియోగిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జుట్టు రాలడం సమస్యలు కూడా తగ్గుతాయి.
Apple Cider Vinegar Hair Water Reduces Hair Fall in 12 Days: యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల చర్మానికి, జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఎసిటిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, అమినో యాసిడ్స్ వంటి అద్భుతమైన మూలకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడం, ఆయిల్ స్కాల్ప్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎసిటిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
యాపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ వాటర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు:
1. ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ 1/3 కప్పు
2. గోరువెచ్చని నీరు
వెనిగర్ హెయిర్ వాటర్ తయారి పద్ధతి:
యాపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ వాటర్ చేయడానికి ముందుగా పాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అందులో 1/4వ వంతు నీటిని పోసి సన్నని సెగతో గోరువెచ్చగా చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనే 1/3 కప్పు సేంద్రీయ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి నీటిని వేడి చేయాల్సి ఉంటుంది. ఇలా చల్లారిన తర్వాత ఆ నీటి పక్కన పెట్టుకుని అప్లై చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
Also Read: White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!
ఇలా ఉపయోగించండి:
యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్‌ను నీటితో జుట్టును శుభ్రం చేయాల్సి ఉంటుంది. అయితే జుట్టుకు అప్లై చేసిన తర్వాత 2 నుంచి 6 నిమిషాలు అలానే ఉంచాల్సి ఉంటుంది. తర్వాత జుట్టును చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జుట్టులో చుండ్రు కూడా దూరమవుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook