Hair growth Tips: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది అమ్మాయిలు జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. కొంతమందిలో పోషకాహార లోపం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. మరికొంత మందిలో జుట్టు బలహీనంగా మారి సన్నబడుతుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసి కొంతమందికి ఆశించిన ఫలితం దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్కాల్ప్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి:


జుట్టు పెరుగుదలను మెరుగుపరచడానికి స్కాల్ప్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.షాంపూతో తలస్నానం చేసినప్పుడల్లా తేలికపాటి చేతులతో తలపై మసాజ్ చేయాడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపడుతుంది.



ఆహారం తీసుకోవడంలో శ్రద్ధ వహించండి:


సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల జుట్టుకు పోషకాలు అందుతాయి. కావున ఆహారం తీసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు.


జుట్టును తేమగా ఉంచాలి:


హెయిర్‌వాష్ చేసే ముందు జుట్టుకు బాగా నూనె రాయాలి. దీంతో కడిగిన జుట్టు పొడిబారకుండా ఉంటుంది.


తడి జుట్టును దువ్వొద్దు:


తడి జుట్టును ఎప్పుడూ దువ్వకండి. దీని వల్ల జుట్టు సమస్యలు వచ్చే అవకశాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంపై కూడా  ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతురన్నారు.



(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Heel Pain: మడమ నొప్పితో బాధపడుతున్నారా..ఈ చిట్కాను పాటించి విముక్తి పొందండి..!!


Also Read: Dieting Home Remedies: బరువు తగ్గేందుకు సులభమైన వంటింటి చిట్కాలు ఇవే