Dieting Home Remedies: బరువు తగ్గేందుకు సులభమైన వంటింటి చిట్కాలు ఇవే

Dieting Home Remedies: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిత్యం పని ఒత్తిడి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఇందులో ప్రధానంగా ఎదురయ్యేది అధిక బరువు. సులభమైన వంటింటి చిట్కాలతో అధిక బరువుకు సమాధానం చెప్పవచ్చంటున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 28, 2022, 02:55 PM IST
Dieting Home Remedies: బరువు తగ్గేందుకు సులభమైన వంటింటి చిట్కాలు ఇవే

Dieting Home Remedies: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిత్యం పని ఒత్తిడి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఇందులో ప్రధానంగా ఎదురయ్యేది అధిక బరువు. సులభమైన వంటింటి చిట్కాలతో అధిక బరువుకు సమాధానం చెప్పవచ్చంటున్నారు. 

సాధారణానికి మించి ఉన్న బరువును ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలంటే వివిధ రకాల పద్దతులున్నాయి. డైటింగ్, వ్యాయామం, యోగా ఇలా చాలా పద్ధతుల్ని ఆశ్రయిస్తుంటారు. అయినప్పటికీ బరువు తగ్గకపోతే..సులభమైన వంటింటి చిట్కాలతో ఆ సమస్య నుంచి విముక్తి కావచ్చంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. కొన్ని రకాల మసాలా దినుసుల్ని మీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువు వేగంగా తగ్గుతుందట. 

ప్రధానంగా జీలకర్ర. ఇళ్లలో ప్రతిరోజూ వాడేదే. జీలకర్ర శరీర బరువును తగ్గించడంలో దోహదపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని జీలకర్ర మార్చగలుగుతుంది. ఇందులో ఉండే ఫైటోస్టెరాల్స్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. బరువు తగ్గేందుకు రోజూ జీలకర్ర నీటిని లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. జీర్ణక్రియను మెరుగుపర్చడం ద్వారా బరువు తగ్గుతారు. ఇక మరో ప్రధాన సుగంధ ద్రవ్యం..దాల్చిన చెక్క. శరీరంలోని చక్కెరను ప్రాసెస్ చేసేది దాల్చిన చెక్కే. శరీరంలో ఉండే షుగర్..కొవ్వుగా మారకుండా దాల్చిన చెక్క నిరోధిస్తుంది. దాల్చిన చెక్క కారణంగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. 

ఇక మరో ముఖ్యమైంది నల్లమిరియాలు. శరీరంలో కొవ్వు కణాల ప్రక్రియను నిరోధిస్తాయి. ఎండుమిర్చి తినడం వల్ల కూడా కొవ్వు సంబంధిత సమస్యలు తలెత్తవు. తరచూ పెప్సీ టీ తాగడం వల్ల ఇన్‌ఫెక్షన్స్ దూరమౌతాయి. నల్ల మిరియాల్ని వివిధ రకాల ఆహార పదార్ధాలతో కలిపి తీసుకోవచ్చు. మరో సుగంధ ద్రవ్యం యాలుక్కాయలు. జీర్ణక్రియకు ఇవి చాలా మంచిది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. జీవక్రియను పెంచడమే కాకుండా ఆహారం సులభంగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. యాలుక్కాయల్ని ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి మంచిదే. 

ఇక భారతీయులకు ప్రత్యేకమైనది పసుపు. పసుపు లేకుండా భారతీయ వంటలుండవు. పూర్తి ఆయుర్వేద గుణాలున్న పుసుపుతో శరీరంలో మంటలు వంటివి దూరమౌతాయి. పసుపు వివిధ రకాల విషపదార్ధాల్నించి మనల్ని కాపాడుతుంది. పసుపు శరీరంలోని మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. బాడీ మెటబాలిజం బాగుంటే అన్ని సమస్యలు దూరమౌతాయి. 

Also read: Banana Flower: రక్త హీనతతో బాధపడుతున్నారా..ఈ పువ్వుతో ఉపసమనం పొందండి..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News