Hair Growth Tips: అంజీర్ పండ్లు శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమేకాకుండా జుట్టు సమస్యలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు దృఢంగా తయారు చేయడానికి సహాయపడుతుంది. అంజీర్‌లో మెగ్నీషియం, విటమిన్-సి, ఇ వంటి లక్షణాలు లభిస్తాయి. కాబట్టి తలలో రక్త ప్రసరణను పెంచేందుకు సహాయపడుతుంది. అయితే తరచుగా జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు అంజీర్‌ పండ్లను జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జుట్టుకు అంజీర్ పండ్లు ఎంత మేలు చేస్తాయో తెలుసా?:
అంజీర్ ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికే కాకుండా జుట్టుకు కూడా చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. అంజీర్ నూనె ఒక గొప్ప హెయిర్‌ కండీషనర్..జుట్టు చిట్లకుండా చేస్తుంది. అంతేకాకుండా జుట్టును మాయిశ్చరైజింగ్ చేయడానికి కూడా సహాయపడుతుంది. హెయిర్‌ గ్రోత్‌ కోసం వివిధ ప్రయత్నాలు చేస్తున్నవారు తప్పకుండా అంజీర్ పండ్లును తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు  రక్త ప్రవాహాన్ని వేగవంతం చేస్తుంది.


జుట్టు సమస్యల కోసం అంజీర్‌ను ఎలా వినియోగించాలో తెలుసా?
అంజీర్‌ పండ్లను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి రోజూ ఆహారంలో 2 అత్తి పండ్లను నీటిలో నానబెట్టిన మిశ్రమంలా తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేయాడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


అంజీర్‌ పండ్ల మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకోండి:
అంజీర్‌ పండ్ల జుట్టుకు బలాన్ని ఇస్తాయి.
ముందుగా రెండు చెంచాల పెరుగులో రెండు చెంచాల శెనగపిండి కలపాలి.
రెండింటినీ బాగా మిక్స్ చేసి పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పేస్ట్‌లో 10 చుక్కల ఫిగ్ ఆయిల్ కలపాలి.
తర్వాత ఈ పేస్ట్‌ని జుట్టుకు పట్టించి గంటపాటు అలాగే ఉంచాలి.
ఆ తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారినికి రెండు సార్లు చేస్తే  జుట్టును పొడవుగా, బలంగా మారుతుంది.


Also Read:  Samantha Ruth Prabhu : నాకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తోడున్నది అదే : సమంత


Also Read: Deepthi Sunaina : స్ట్రెస్ ఉంది.. అక్కడ చెమటలు పడుతున్నాయ్.. దీప్తి సునయన కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook