Hairmask for Long Hair: జుట్టు పెద్దగా పెంచుకోవాలని చాలామంది ఆడవాళ్లకు ఉంటుంది. దీనికి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే, కొన్ని దుష్ర్పభావాలను ఇస్తాయి. అయితే, మన వంటగదిలో అందుబాటులో ఉండే కొన్ని హెయిర్‌ మాస్కులతో మీ జుట్టు త్వరగా నడుం వరకు పెరుగుతుంది. అవి ఏంటో తెలుసా? దీంతో మీ జుట్టు మీరు నమ్మలేని విధంగా పొడుగ్గా పెరుగుతుంది.ఈ ఎండకాలం జుట్టు పూర్తిగా పొడిబారటం, హెయిర్‌ ఫాల్ సమస్యలు పెరిగిపోతాయి. అంతేకాదు బయటకు వెళ్లి పనులు చేసే వారికి జుట్టు సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. దుమ్మూ, ధూళీ పూర్తిగా పేరుకుంటుంది. దీనికి సరైన జీవనశైలిని అనుసరిస్తు కొన్ని హెయిర్‌  ప్యాకులు ట్రై చేయండి. ఇది జుట్టును ఆరోగ్యవంతంగా పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మన వంటగదిలో మెంతులు ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాయి. అంతేకాదు పాలు, కొబ్బరి నూను కూడా ఉంటాయి. పాలలో లాక్టోజ్ ఉంటుంది. ఇక కొబ్బరి నూనెలో మీ జుట్టుకు మాయిశ్చర్ అందించి పొడిబారకుండా కాపాడుతుంది. జుట్టు స్ల్పిట్‌ సమస్య రాకుండా నివారిస్తుంది. కొబ్బరి నూనెతో మీ జుట్టు పొడవుగా పెరుగుతుంది. ఈ వస్తువులను కలిపి మీ జుట్టుకు హెయిర్‌ మాస్క్‌ తయారు చేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొడవైన జుట్టుకు హెయిర్‌ మాస్క్..
మెంతులు
పాలు
అలోవెరా జెల్
కొబ్బరి నూనె


ఇదీ చదవండి: ముఖం ట్యాన్‌ అయిపోయిందా? ఈ బెస్ట్‌ బీట్‌రూట్‌ ఫేస్‌ప్యాక్‌ వేయండి డీట్యాన్‌ అయిపోతుంది..


లాంగ్‌ హెయిర్‌ కోసం ఈ ప్యాక్ ఎలా తయారు చేయాలి?
పొడవాటి జుట్టు కోసం మీరు ఈ హెయిర్‌ ప్యాక్‌ను తయారు చేయాలనుకుంటే ముందు రోజు రాత్రి సమయంలో మెంతులను మీ జుట్టుకు సరైన పరిమాణంలో నీళ్లలో వేసి నానబెట్టుకోవాలి. మెంతులు మన జుట్టు సహజమైన మెరుపును అందిస్తాయి. ఈ మెంతులను ఉదయం బ్లెండర్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ రెడీ అయినట్లే ఆ తర్వాత ఇందులో కలబంద, కొబ్బరి నూనె, పాలు కూడా వేసి బాగా కలపాలి. ఈ పేస్టు రెడీ అయినట్లే.


ఇదీ చదవండి: ఉల్లిపాయ రసం ఇలా వాడితే జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..


జుట్టుకు ఎలా అప్లై చేయాలి?
మీ జుట్టు పెరుగుదలకు వేసుకునే ఈ మెంతి హెయిర్‌ ప్యాక్ వేసుకునే ముందు రోజు జుట్టు బాగా కడగాలి. ఏ జిడ్డు లేకుండా జాగ్రత్త పడాలి. ఆ మరుసటి రోజు మీ జుట్టుకు ఈ హెయిర్‌ ప్యాక్‌ వేయండి. జుట్టు విభాలుగా ఈ ప్యాక్‌ వేయాలి. జుట్టు మొత్తం ఈ ప్యాక్ వేసిన తర్వాత కనీసం అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత హెయిర్‌ వాష్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు సహజంగా మెరుస్తూ నడుం వరకు పెరుగుతుంది. ఈ హెయిర్‌ ప్యాక్‌ ను కనీసం వారానికి ఒకసారైనా అప్లై చేయండి. దీనివల్ల అతి త్వరలోనే మంచి ఫలితాలను పొందుతారు..(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter