Detan Facepacks: ముఖం ట్యాన్‌ అయిపోయిందా? ఈ బెస్ట్‌ బీట్‌రూట్‌ ఫేస్‌ప్యాక్‌ వేయండి డీట్యాన్‌ అయిపోతుంది..

Detan Facepacks with beetroot: బీటాలియన్ అనే సహజసితమైన వర్ణ ద్రవ్యం  బీట్‌రూట్‌లో ఉంటుంది. ఇది ముఖ రంగును మెరుగుపరిచే గుణాలు కలిగి ఉంటుంది. ముఖంపై పేరుకున్న టాన్ తొలగించి మంచి రేడియన్స్ లుక్ వచ్చేలా ప్రోత్సహిస్తుంది.

Written by - Renuka Godugu | Last Updated : May 12, 2024, 07:57 AM IST
Detan Facepacks: ముఖం ట్యాన్‌ అయిపోయిందా? ఈ బెస్ట్‌ బీట్‌రూట్‌ ఫేస్‌ప్యాక్‌ వేయండి డీట్యాన్‌ అయిపోతుంది..

Detan Facepacks with beetroot: బీటాలియన్ అనే సహజసితమైన వర్ణ ద్రవ్యం  బీట్‌రూట్‌లో ఉంటుంది. ఇది ముఖ రంగును మెరుగుపరిచే గుణాలు కలిగి ఉంటుంది. ముఖంపై పేరుకున్న టాన్ తొలగించి మంచి రేడియన్స్ లుక్ వచ్చేలా ప్రోత్సహిస్తుంది. బీట్రూట్ ని ఉపయోగించి డీట్యాన్ ఫేస్ ప్యాక్ లు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

బీట్‌రూట్‌ యోగర్ట్‌ ఫేస్ ప్యాక్..
ఒక చిన్న బీట్రూట్ 
యోగర్ట్‌- 2tbsp

తయారీ విధానం..
బీట్‌రూట్‌ ని సన్నగా గ్రేట్ చేసుకొని జ్యూస్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు జ్యూస్ లో యోగర్ట్‌ వేసి కలిపి స్మూత్ పేస్ట్ లా తయారు చేసుకోవాలి.ఈ పేస్ ప్యాక్ ను ముఖం మెడ భాగం లో అప్లై చేసుకోని 20 నిమిషాలు పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ముఖాన్ని నార్మల్ క్లాత్ తో శుభ్రపరచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఇందులో బ్లీచింగ్ గుణాలు ఉంటాయి కాబట్టి మీ స్కిన్ మెరుగుపడుతుంది. టాన్ తొలగిపోతుంది పెరుగులో ఉండే కూలింగ్ గుణాలు ముఖాన్ని మృదువుగా మారుస్తాయి నాచురల్ ఎక్స్‌ఫోలియేటర్‌ గా పనిచేస్తుంది
 
బీట్‌రూట్‌, లెమన్  ఫేస్ ప్యాక్..
నిమ్మరసం - 1tbsp
బీట్‌రూట్‌-1

ఫేస్‌ ప్యాక్‌ తయారీ విధానం..
బీట్‌రూట్‌ గ్రేట్ చేసి జ్యూస్ తీసి పెట్టుకొని అందులో లెమన్ జ్యూస్ యాడ్ చేసి ముఖం మెడ భాగంలో అప్లై చేసుకోవాలి. దీని ఒక 15 నిమిషాలు పాటు అలాగే ఆరనివ్వండి. ఆ తర్వాత చల్లని నోటితో ఫేస్ వాష్ చేసుకోవాలి
ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై సహజసిద్ధంగా మెరుపు వస్తుంది. ముఖం మంచి గ్లో కనిపిస్తుంది మీ ముఖంపై ఉన్న టాన్ని తొలగిస్తుంది అంతేకాదు డార్క్ స్పాట్స్ కి కూడా చెక్ పెడుతుంది బీట్రూట్లో లెమన్ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఇందులో ఉండే న్యూట్రియన్స్ మన చర్మాన్ని గ్రహిస్తాయి.

బీట్‌రూట్‌, తేనె ఫేస్ ప్యాక్..
ఒక బీట్రూట్ చిన్నది 
తేనె- 1tbsp

బీట్‌రూట్‌ జ్యూస్ తీసి పెట్టుకుని అందులోనే తేనె వేసి కలపాలి. ఇది ముఖం మెడ భాగంలో అప్లై చేసి ఓ 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. తేనే ముఖంపై మాయిశ్చర్ నిలుపుతుంది, మృదువుగా మారుస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే సహజసిద్ధమైన యాంటీ యాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ని తొలగించి మన చర్మాన్ని ఆరోగ్యవంతం చేస్తాయి.

ఇదీ చదవండి: టమోటా, పసుపుతో ఈ ఫేస్‌ప్యాక్‌ తయారు చేసుకోండి.. మీ ముఖానికి గోల్డెన్‌ గ్లో..

బీట్‌రూట్‌, పసుపు ఫేస్ ప్యాక్..
ఒక చిన్న బీట్రూట్
 పసుపు- అర చెంచా

ఇదీ చదవండి: హిమాలయన్ పింక్ సాల్ట్ తో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు..

బీట్‌రూట్‌ జ్యూస్ లో పసుపు వేసి పేస్టు మాదిరి తయారు చేసుకొని ముఖ మెడ భాగంలో అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు ఆరిన తర్వాత చల్లని నీటితో మాత్రమే ఫేస్ వాష్ చేసుకోవాలి. పసుపులో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ముఖంపై ఉన్న మచ్చలు తగ్గిస్తాయి. బీట్‌రూట్‌ నాచురల్ యాంటీ ఆంటీ ఆక్సిడెంట్స్ ఈవెంట్ స్కిన్ స్టోన్ కి ప్రేరేపిస్తుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News