Happy Pongal 2023: సంక్రాంతి పండగ ప్రాముఖ్యత.. ఇవే కథల నుంచి పండగ పుట్టుకొచ్చింది.!
Happy Pongal 2023: పూర్వీకులంతా సంక్రాతిని ఎంతో ప్రత్యేకంగా జరుపుకునేవారు. అదే రోజూ భక్తి శ్రద్ధలతో దేవతల అనుగ్రహం పొందేందుకు పూజా కార్యక్రమాలు చేసేవారు. మరి కొందరైతే గంగిరెద్దులను కూడా పూజిస్తారు.
Happy Pongal 2023: సంక్రాంతి తొలి సంవత్సరం వచ్చే తొలి పండుగ కావడంతో హిందూ సాంప్రదాయంలో చాలా ప్రముఖ్యత కలిగి ఉంటుంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని మనకు పెద్దల నుంచి తెలిసిన విషయం. అయితే ఈ రోజూ ప్రజలంతా తెల్లవారి జామునే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి ముత్యాల ముగ్గులు చుడతారు. ఈ పండగకు తరతరాల నుంచి ఒక ప్రాచీన కథగా ఉంది. ఎందుకు సంకాత్రిని మొదటి పండగా జరుపుకుంటారు. అయితే ఈ పండగ జరుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
ప్రాచీన కథ:
పురాణాల ప్రకారం..సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకు దాదాపు 60 వేలకు కొడుకుంలుండేవారట. వీరంతా ఒక రోజు అనుకోకుండా కపిల ముని ఆశ్రమంకు వెళ్తారు. అయితే అదే ప్రదేశంలో పిలముని తపస్సు చేయగా.. ఇంతలోనే సగరుడు 60 వేల మంది కూమారులు తపస్సుకి భంగం కలిపిస్తారు. దీంతో ఆ ముని తీవ్ర అగ్రహానికి గురై వాళ్లందరినీ బూడిదగామార్చేస్తాడు. అయితే వీరి ఆత్మ శాంతి కలగడానికి ఓ కార్య క్రమం చేయాల్సి ఉంటుంది. అది సగరుడు రాజుకు తెలియదు. అయితే అదే వంశంలో పుట్టిన భగీరధుడుకి ఈ శాంతి కలగడానికి కావాల్సిన విషయం దాగి ఉంటుంది. భగీరధుడు 60 వేల మంది సోదరుల ఆత్మను శాంతించేందుకు ఆకాశంలో ఉండే గంగని తపస్సుతో నేల మీదకి రప్పిస్తాడు. అయితే భగీరధుడు ఎన్నో సంవత్సరాలు కష్టపడి తపస్సు చేస్తాడు. దీంతో గంగమ్మ తన తపస్సుకు మెచ్చి సంక్రాంతి రోజునే గంగ నేల మీదకి వచ్చి బుడిదపై నుంచి గంగ ప్రవహిస్తుంది. దీంతో వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది.
గంగిరెద్దుల ప్రాముఖ్యత:
పూర్వీకుల తెలిపిన కథ ప్రకారం.. గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట. ఈ రక్షసుడికి శివుడంటే చాలా ఇష్టం.. అయితే నిత్యం శివున్ని పూజిస్తూ భక్తి శ్రద్ధలతో ఉండేవాడు గజాసురుడు. . ఒకసారి శివుని అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేస్తాడు. దీంతో శివుడు తపస్సుకు మెచ్చి ఎల్లపుడు శివుడు కడుపులో ఉండేలా వరాన్ని కోరుకుంటాడు. దింతో శివుడు భోలా శంకరుడు కాబట్టి వరానికి నాంది పలుకుతాడు. దీంతో శివుడు గజాసురిడి కడుపులోకి వెళ్లిపోతాడు. అయితే శివుడు కడుపులోకి వెళ్లడం వల్ల దేవత లోకంలో చాలా రకాల మార్పులు సంభవిస్తాయి.
అయితే ఈ మార్పులను గమనించి దేవతలు శివున్ని గజాసురుడి కడుపులో నుంచి తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. దేవతలంతా వాయిద్యాన్నీ పట్టుకుని నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరుతారు. దేవతల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అగుతాడు. తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని కోరుకుంటారు. దీంతో శివుడు గజాసురుడి కడుపులో నుంచి బయటకు సంక్రాతి రోజు వస్తాడు. అయితే అడిగిన కోరికను తీర్చినందుకు గజాసురుడును గంగిరెద్దుగా చెప్పుకుంటారు.
Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్
Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి