Makar Sankranti 2023: సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వరకు తన ప్రయాణాన్ని ప్రారంభించే సమయం మకర సంక్రాంతి. అంటే సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచరించే సమయాన్నే మకర సంక్రాంతి అంటారు. పంచాంగ ప్రకారం.. ఈ ఏడాది జనవరి 15న జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి పండుగను మన దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతిగా, తమిళనాడులో పొంగల్‌గా జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటారో తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మకరసంక్రాంతి మూడు రోజుల పాటు జరుపుకుంటారు. భోగి పండుగ సందర్భంగా ఆరు బయట భోగి మంటలతో సందడి నెలకొంటుంది. ప్రతి ఇంటి ముందు వివిధ రంగుల రంగోలి పూలతో అలంకరించడం ఆనవాయితీ. కోళ్ల పందాలు, డూడూ బసన్నవ సందడితో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.  


తమిళనాడు పొంగల్ పండుగగా జరుపుకుంటారు. పొంగల్ ముందురోజు భోగి ఆచారంలో భాగంగా పాత వస్తువులను సేకరించి వాటిని కాల్చి శుద్ధి చేసే ఆచారం ఉంది. ఇక్కడ పొంగల్ నాలుగు రోజుల పండుగ. తమిళ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది వేడుకలు జనవరి 14న ప్రారంభమై జనవరి 17న ముగుస్తుంది.


మకర సంక్రాంతి వేడుకలను కర్నాటకలో సుగ్గి అని పిలుస్తారు. ఈ రోజున ఇక్కడ ప్రత్యేక స్వీట్లు తయారుచేస్తారు. ఈ తీపి వంటకాలను వేరుశనగ, బెల్లం, కొబ్బరితో తయారు చేసి అందరికీ పంచుతారు. ఈ ఆచారాన్ని ఎల్లు బిరోడు అంటారు. భోగి ఆచారం కూడా ఇక్కడ ఉంది.


మహారాష్ట్రలో మకర సంక్రాంతి సందర్భంగా మహారాష్ట్ర-తిలగుడి టిల్ లడ్డూలను తయారు చేసి కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపిణీ చేస్తారు. ఒకరికొకరు నమస్కారం చేసుకుంటూ 'తిల్ గుల్ ఘ్యా గాడ్ గాడ్ బోలా' అని చెప్పుకుంటారు. ఈ తిలగుడ్లను స్వీకరించి మధుర భాషణం చేయడం ఆనవాయితీ.


మకర సంక్రాంతిని గుజరాతీలు ఉత్తరాయణంగా జరుపుకుంటారు. ఈ రోజుల్లో వారు తమ బంధువులు, స్నేహితులతో గాలిపటాలు ఎగురవేయడానికి స్వీట్లు కూడా సిద్ధం చేస్తారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటారు. 


ఈ పండుగను యూపీలో ఖిచ్డీ లేదా ఖిచేరి అంటారు. ఖిచ్డీని ప్రత్యేక భోజనంగా తయారు చేసి ముందుగా స్వామికి నైవేధ్యంగా సమర్పిస్తారు. ఆ తరువాత కుటుంబ సభ్యులందరికీ పంచిపెడతారు. పంజాబ్ ప్రజలు ఈ పండుగను మాఘీగా జరుపుకుంటారు. వారు ఈ రోజును లోహ్రీగా, మకర సంక్రాంతికి ముందు రోజుగా జరుపుకుంటారు. మకర సంక్రాంతిని పశ్చిమ బెంగాల్‌లో గంగాసాగర్‌లో పవిత్ర స్నానం చేసి జరుపుకుంటారు. ఈ సందర్భంగా గంగాసాగర్ మేళా కూడా నిర్వహిస్తారు.


ఒడిశాలోని భుయాన్ తెగలు మకర సంక్రాంతి నాడు తమ కొత్త సంవత్సరాన్ని గుర్తు చేసుకోవడానికి ఆచారాలను నిర్వహిస్తారు. ఫైర్ డ్యాన్స్ కూడా ఇందులో భాగమే. మహాయాత్ర అనే ఊరేగింపు నిర్వహిస్తారు. కేరళలో మకర సంక్రాంతిని మకర విలక్‌గా జరుపుకుంటారు. ఈ సమయంలో వెలిగే మకర జ్యోతిని చూడటానికి దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు శబరిమలకు వస్తారు. అస్సాంలో మకర సంక్రాంతిని మాగ్ బిహు అంటారు. పంట ముగింపు సందర్భంగా, గొప్ప వ్యవసాయ విజయాలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇక్కడ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. బిహు నృత్యం అనే ప్రత్యేక నృత్య రూపాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు.


Also Read: Pawan Kalyan Speech: నేను అన్నింటికీ తెగించిన వాడిని.. మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్‌ రియాక్షన్ ఇదే..   


Also Read: Khammam Politics: తుమ్మల పార్టీ మార్పుపై క్లారిటీ.. పొంగులేటి దారెటు..?   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి