Ponguleti Srinivasa Reddy likely Will Join in BJP: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ తగలబోతోందా..? సీఎం కేసీఆర్ టూర్ కీలక నేతలను కలిపిందా..? మాజీ మంత్రి తుమ్మల దారెటు..? పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారబోతున్నారా..? ఖమ్మం జిల్లా రాజకీయాలపై ప్రత్యేక కథనం..
ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌లో అసంతృప్తి జ్వాల తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల పార్టీకి దూరంగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ఇతర జిల్లా నేతలు సీఎం కేసీఆర్ టూర్‌లో కలిసిపోయారు. పార్టీ అధినేతతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయం, జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంతో అప్యాయంగా మాట్లాడారు. దీంతో తుమ్మల, ఇతర బీఆర్ఎస్ నేతలు పార్టీ మారుతున్నారన్న ప్రచారానికి చెక్ పడింది.
అంతకుముందు సీనియర్ నేత తుమ్మలను మంత్రి హరీష్‌రావు బృందం కలిసింది. భేటీలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అసంతృప్తిగా ఉన్న తుమ్మలను బుజ్జగించినట్లు ప్రచారం జరుగుతోంది. పాలేరు టికెట్‌పై కూడా చర్చ జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పక్కా హామీ రావడంతోనే సీఎం కేసీఆర్ పర్యటనలో ఆయన పాల్గొనట్లు ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
మరోవైపు మరో సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం సీఎం టూర్‌లో కనిపించలేదు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలో కేంద్ర మంత్రి అమిత్ షాను కలవపోతున్నారని తెలుస్తోంది. బీజేపీ నుంచి నాలుగు ఆఫర్లు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి పొంగులేటి సైతం ఓకే చెప్పినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఖమ్మంలో చేపట్టే భారీ బహిరంగ సభ ద్వారా బీజేపీలో చేరబోతున్నారని సమాచారం. ఇందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సీఎం కేసీఆర్ టూర్‌తో తుమ్మల వెనక్కి తగ్గినా.. పొంగులేటి మాత్రం బీఆర్ఎస్‌లో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఆయనతోపాటు భారీగా కార్యకర్తలు, అభిమానులు కమలం గూటికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఏదిఏమైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తప్పేలా లేదు.
Also Read: Pawan Kalyan: ఆ రోజు సినిమాలు వదిలేస్తా.. తుదిశ్వాస వరకు రాజకీయాలు వదలను: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి