Happy Republic Day 2024: జనవరి 26 భారతదేశంలో రిపబ్లిక్ డే ఉత్సవాన్ని జరుపుకుంటారు. 1950 జనవరి 26వ తేదీ భారతదేశ రాజ్యాంగం అమల్లో వచ్చిన రోజు. దేశమంతా రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఒకరికొకరు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటుంటారు. వాట్సప్ మెస్సేజ్‌లు, స్టేటస్, ఎస్ఎంఎస్ ద్వారా రిపబ్లిక్ డే విషెస్ తెలుపుకుంటారు. మీరు కూడా మీ స్నేహితులు, బంధుమిత్రులకు రిపబ్లిక్ డే విషెస్ చెప్పాలనుకుంటే...మీ కోసం కొన్ని గ్రీటింగ్స్, విషెస్...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ప్రతి గుండెలో ఇండియా..ప్రతి ఆలోచనలో దేశభక్తి...పుట్టిన ఈ నేలంటే మాకందరికీ గర్వ కారణం...అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024


2. దేశం గర్వించే రోజు ఇది...దేశం సగర్వంగా తల ఎత్తుకున్న క్షణమిది. మా ప్రతి శ్వాస దేశం కోసమే..Happy Republic Day 2024


3. భారత రాజ్యాంగం అందరికీ గర్వ కారణం, దశాబ్దాలుగా భారత్ కీర్తికి కారణమదే..అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత.. అందరి గుండెల్లో సోదర భావం..అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


4. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులకు సలాం..దేశం కోసం ప్రాణాలు బలిచ్చిన వీరుల తల్లులకు ప్రణామాలు..హ్యాపీ రిపబ్లిక్ డే 2024


5. నాకు ధనం వద్దు..ఈ దేహం వద్దు..కావల్సిందల్లా ప్రశాంత భారతదేశం..నా చివరి శ్వాస ఉన్నంతవరకూ దేశం కోసమే నా ప్రతి అడుగు..Happy Republic Day 2024


6. దేశం కోసం ప్రాణాలిచ్చిన అమరవీరులకు నమో నమామి..మీ త్యాగం మరువలేనిది, మీ సేవలు అనన్యమైనవి. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు


7. ఓ నా దేశ ప్రజలారా..దేశం కోసం నినదించండి..ఇదొక శుభదినం..మనందరిదీ..ఈ మువ్వన్నెల జెండానే మన గౌరవం..వీరుల త్యాగం మరవద్దు..అందరికీ శెల్యూట్. హ్యాపీ రిపబ్లిక్ డే 2024


8. జీవన్మరణాలు మతం పేరిట వద్దు..మానవత్వమే ప్రతి ఒక్కరి మతం..అందరికీ అదే మార్గదర్శకత్వం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2024


9. మువ్నన్నెల జెండా..ముచ్చటైన జెండా..మన దేశం జెండా..అందరీకీ ఇదే అండ..నింగిలో ఎగిరే జెండా..నిలువెత్తు కీర్తికి చిహ్నం ఈ జెండా..హ్యాపీ రిపబ్లిక్ డే  2024


10. మనసులో నిష్కల్మషం, మాటల్లో నిజాయితీ, రక్తంలో ఆవేశం..గుండెల నిండా ధైర్యం ఇదే భారతీయకులకు గర్వ కారణం..అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే 2024


Also read: Ayodhya Trains: అయోధ్య వెళ్లాలనుకుంటున్నారా, దేశంలోని వివిధ రాష్ట్రాల్నించి అయోధ్యకు రైళ్లు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook