Happy Teddy Day 2023 Wishes: టెడ్డీ డే విషెస్ ఇలా చెప్పండి.. మీ పార్టనర్స్ ఫిదా అవడం గ్యారెంటీ!
Teddy Day 2023 Wishes: ప్రపంచ వ్యాప్తంగా టెడ్డీ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు, పెద్ద పెద్ద టెడ్డీ బేర్‌లను ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటున్నారు, ఆ వివరాల్లోకి వెళితే
Happy Teddy Day 2023 Wishes: టెడ్డీ డే అనేది వాలెంటైన్స్ వీక్‌లో నాల్గవ రోజు, దీనిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న ఘనంగా జరుపుకుంటారు ప్రేమికులు. ఈ రోజున, ప్రేమ జంటలు ఒకరికొకరు టెడ్డీ బేర్‌లను బహుమతిగా ఇచ్చుకోవడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు.
టెడ్డీ డే రోజున అందమైన టెడ్డీతో, మీరు మీ హృదయపు అంచులలో ఉన్న భావాలను అందమైన పదాలలో కవితాత్మకంగా రాయడం ద్వారా వాలెంటైన్స్ వీక్‌లో మీ భాగస్వామికి శుభాకాంక్షలు కూడా తెలియజేయవచ్చు. మీరు ఈ ప్రత్యేకమైన రోజున టెడ్డీతో పాటు మీ ప్రియమైన వారికి ప్రేమపూర్వక సందేశాలను కూడా పంపవచ్చు. మీ ప్రియమైన వారి ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడానికి మీకు ఇదే సరైన సమయం.
చాలా మంది అమ్మాయిలు స్టఫ్డ్ బొమ్మలను ఇష్టపడతారు, అందుకే టెడ్డీ డే సందర్భంగా, అబ్బాయిలు తమ స్నేహితురాలు లేదా తాము ఇష్టపడే అమ్మాయికి టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా వారిని మనసు గెలవచ్చు. మార్కెట్లో అనేక రకాల టెడ్డీ బేర్స్ అందుబాటులో ఉన్నా టెడ్డీ బేర్ రకం, రంగు కూడా చాలా ముఖ్యం. హార్ట్ సింబల్ ఉన్న ఎర్రటి టెడ్డీ బేర్ ప్రేమను వ్యక్తపరిస్తే గులాబీ లేదా పసుపు రంగు టెడ్డీ బేర్ స్నేహం మరియు ఇష్టానికి చిహ్నం.
ఇక మీకోసం కొన్ని టెడ్డీ డే విషెస్ కొటేషన్లు మీ కోసం
నా జీవితంలో కూడా ఆ అందమైన క్షణం రావాలని కోరుకుంటున్నా
నా టెడ్డీ పొందిన వెంటనే, ఎవరైనా నాతో కూడా ప్రేమలో పడతారు : హ్యాపీ టెడ్డీ డే
నేను మీకు చాలా ప్రేమతో టెడ్డీని పంపుతున్నాను
మీరు నన్ను ప్రేమిస్తే , ఎల్లప్పుడూ టెడ్డీని జాగ్రత్తగా ఉంచండి : హ్యాపీ టెడ్డీ డే
నా హృదయం చాలా కాలంగా తహతహలాడుతోంది
టెడ్డీ డే సాకుతోనైనా రా,
నా స్నేహితులు కూడా నాకు శత్రువులయ్యారు : హ్యాపీ టెడ్డీ డే
Also Read: Amigos Movie Review: కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Also Read: PK Rosy Google Doodle: దేశంలోనే మొదటి దళిత నటి.. సినిమాలో నటించిందని ఇల్లు తగలబెట్టేశారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook