Happy Womens Day Wishes 2024: ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా తెలపండి..స్పెషల్ కోట్స్..
Happy Womens Day Wishes In Telugu: 1908వ సంవత్సరంలో మహిళల ప్రత్యేక హక్కుల కోసం న్యూయార్క్ వీధుల్లో జరిగిన నిరసనలకు విజయంగా ప్రతి ఏటా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళల దినోత్సవం జరుపుకుంటారు. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన దినోత్సవాన్ని ప్రతి ఒక్క స్త్రీ జరుపుకోవాలని కోరుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Happy Womens Day Wishes 2024 In Telugu: ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని భారతదేశవ్యాప్తంగా మార్చి 8వ తేదీన జరుపుకుంటారు. మహిళలు తమ హక్కుల కోసం, సాధికారిక కోసం ఉద్యమించాల్సిన కర్తవ్యాన్ని ఎంతగానో గుర్తు చేసుకోవాల్సిన రోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న సామాజిక సంస్థల్లోనూ కంపెనీలోను ప్రభుత్వ రంగ సంస్థల్లోని రాజకీయ రంగాల్లోనూ మహిళలు సాధించిన విజయాలను గుర్తిస్తూ వారిని గౌరవిస్తారు. 1908 సంవత్సరంలో న్యూయార్క్ వీధుల్లో మహిళలు తమ హక్కుల కోసం చేసిన పోరాటాన్ని గుర్తిస్తూ ప్రతిఏటా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పోరాటంలో భాగంగా మహిళలకు ఎక్కువ పని గంటల సమయం, కార్యాలయాల్లో ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ నిరసన జరిగినట్లు చరిత్రలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన మహిళా దినోత్సవాన్ని ప్రతి ఒక్క మహిళ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు:
1. ఝాన్సీ లక్ష్మీబాయి సాహసానికి, సరస్వతీ దేవి జ్ఞానానికి, మాతృమూర్తి త్యాగానికి ప్రతీక అయిన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
2. మీలోని దాగి ఉన్న శక్తిని గుర్తించి, మీ కలలను నెరవేర్చుకోండి. మీ లక్ష్యాలను మీరే ముందుండి సాధించండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
3. ఈ ప్రపంచాన్ని మరింత అందంగా, ప్రేమతో నిండిన ప్రదేశంగా మార్చడానికి నిరంతరం కృషి చేసే మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
4. స్వాతంత్య్రం, సమానత్వం, సాధికారత కోసం పోరాడిన మహిళా ధైర్య సాహసాలకు నివాళి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
5. మీరు ఎంచుకున్న రంగంలో రాణించి..మీ జీవితాన్ని సంతోషంగా, ఆనందంగా గడపండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
6. ప్రతి మహిళలో ఒక దేవత ఉంటుంది. ఆ దేవతను ఎల్లప్పుడూ గౌరవించండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
7. మీ లోని శక్తిని నమ్మండి, మీ లక్ష్యాలను ఛేదించేందుకు ముందడు వేయండి. మీ కలలను సాకారం చేసుకోండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
8. మీ జీవితంలో ప్రతిరోజూ ఒక వేడుకలా ఉండాలని కోరుకుంటూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
9. మీరు ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం. మీలాంటి మహిళలు ఈ ప్రపంచానికి చాలా అవసరం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
10. మీ చిరునవ్వుతో ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మార్చండి. మీ ఆనందంతో ఈ ప్రపంచాన్ని మరింత ఆనందంగా ఉంచండి..మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
11. మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, అడ్డంకులను అధిగమించి, విజయాలను పొందాలని కోరుకుంటూ.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
12. మీ లోని ధైర్యాన్ని, ఓర్పును ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీరు ఎంత బలమైన వారో అప్పుడు తెలుస్తుంది.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి