Harmful Food For Men: పురుషులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ఆహార పదార్థాలను తినకపోడమే మంచిది!
Harmful Food For Men: మనదేశంలో ఊరగాయ ప్రియులు ఎక్కువ మంది ఉన్నారు. ఆహారంలో కొంతమందికి పచ్చడి లేనిదే ముద్ద దిగదు. అలా ఊరగాయలను అతిగా తినడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
Harmful Food For Men: భారతదేశంలోని ఏ మూలకు వెళ్లినా దాదాపు ప్రతి ఇంట్లో ఊరగాయ దొరుకుతుంది. మనదేశంలో చాలా మంది పచ్చడిని ఇష్టంగా తింటారు. ఇది ఆహారంలో రుచిని పెంచుతుంది. ఇలాంటి కూరగాయను చాలాసార్లు ఇంట్లో తయారు చేస్తారు. అయితే అవి ఆరోగ్యానికి అంతగా మంచివి కాదని కొందరు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యువకులు, వివాహితులైన పురుషుల్లో ఎక్కువ మంది పచ్చడి తినకూడదని మీకు తెలుసా?
ఊరగాయలు ఎక్కువగా తినడం ఎందుకు హానికరం?
ఊరగాయ మసాలా రుచి మనల్ని ఆకర్షితులను చేస్తుంది. కానీ దాని తయారీలో చాలా నూనెను ఉపయోగిస్తారు. అలాగే సూర్యరశ్మి సరిగా పడకపోతే అందులో వాడే మసాలాలు కూడా పచ్చిగా ఉంటాయి. ఈ 2 కారణాల వల్ల, అధిక కొలెస్ట్రాల్, జీర్ణక్రియ సమస్య ఏర్పడుతుంది. అలాగే పురుషుల లైంగిక ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది.
ఊరగాయలు పురుషుల సంతానోత్పత్తికి కీడు చేస్తాయి?
ఏదైనా అతిగా తినడం హానికరమని రుజువు అవుతుంది. అటువంటి పరిస్థితిలో ఊరగాయలను వివాహిత పురుషులు ఎక్కువగా తీసుకుంటే దాని పులుపు పురుషుల సంతానోత్పత్తిపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుందని తెలుస్తోంది. ఈ విధంగా వివాహ జీవితం ఆనందాన్ని ముగించడమే కాకుండా.. తండ్రిగా మారడంలో కూడా సమస్యలు తలెత్తుతాయి.
ఇంట్లో ఊరగాయ సిద్ధం
ఈ సమస్యలను నివారించేందుకు మీరు పరిమిత పరిమాణంలో ఊరగాయలను తీసుకోవాలి. వీలైతే ఇంట్లోనే ఊరగాయ తయారు చేసి అందులో నూనె, కొన్ని మసాలా దినుసులు వాడాలి. దాన్ని గాజు పాత్రలో నిల్వ చేయండి. మీరు పచ్చిమిర్చిని సరిగ్గా సూర్యరశ్మికి తగిలే విధంగా ఉంచి.. తినొచ్చు. సాధారణంగా ప్రజలు మార్కెట్ నుంచి ఊరగాయలను కొనుగోలు చేస్తారు. ఇందులో చాలా సార్లు పరిశుభ్రత గురించి పట్టించుకోరు.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Raw Milk Side Effects: పచ్చి పాలను తాగుతున్నారా..! అయితే మీరు అనారోగ్య బారిన పడటం ఖాయం..!!
Also Read: CNG Car Tips: వేసవిలో CNG వాహనదారులు కచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook