Lemon Water On Empty Stomach: ఉదయాన్నే టీలు, కాఫీలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు.  అయితే వీటికి బదులుగా మీరు ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరును తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య లాభాలను పొందుతారు. నిమ్మకాయలో ఎన్నో పోషకాలు ఉంటాయి.  ఇవి మన శరీరానికి చాలా అవసరం.     


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉదయం పరగడుపున నిమ్మకాయ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: 


నిమ్మకాయ నీరు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణవ్యస్థ మెరుగుపడుతుంది. ఈ నీరు కడుపులో యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆహారం అరుగుదలకు సహాయపడుతుంది.  అంతేకాకుండా అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఈ నిమ్మకాయ నీరు తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్ల్‌ తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్‌ ఆకలి కోరికలను నియంత్రించడంలో మేలు చేస్తుంది. 


నిమ్మరసం మూత్రంలో సిట్రేట్ స్థాయిలను పెంచుతుంది, ఇది మూత్రపిండాల రాళ్ల ఏర్పాటును నిరోధించడంలో సహాయపడుతుంది. నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది, ఇవి చర్మంకి నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది ముడతలను తగ్గించడానికి మేలు చేస్తుంది.  చర్మని కాంతివంతంగా చేయడానికి కూడా సహాయపడుతుంది. నిమ్మరసం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో శరీరంలోని విషాలను బయటకు పంపడానికి మేలు చేస్తుంది. నిమ్మరసం పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. నిమ్మరసం చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి  మొటిమలు, ముడతలు వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.  నిమ్మరసం విటమిన్ సి  రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులను నివారించడానికి మేలు చేస్తుంది. 
నిమ్మరసం శరీర జీవక్రియను పెంచుతుంది అలాగే ఇది కొవ్వును కరిగించడానికి  బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వారికి నిమ్మకాయ రసం ఎంతో మేలు చేస్తుంది. మ్మరసం నోటిలోని బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది, ఇది దుర్వాసనను తగ్గిస్తుంది.


గుర్తుంచుకోండి:


పరగడుపున నిమ్మకాయ నీరు తాగేటప్పుడు, ఒక గ్లాసు నీటిలో అర నిమ్మరసం కలిపి తాగాలి.
చాలా ఎక్కువ నిమ్మరసం తాగడం వల్ల పళ్ళు క్షయించడం వంటి దుష్ప్రభావాలు రావచ్చు.
మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, నిమ్మకాయ నీరు తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
నిమ్మకాయ నీటితో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం తినడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ముఖ్యం.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి