HD Glow Face Mask: ఈ ఫేస్ మాస్క్‌తో 2 రోజుల్లోనే ఇంట్లోనే ముఖంపై HD గ్లో పొందడం ఖాయం..మచ్చలు లేని, మెరిసే చర్మం మీ సొంతం..
How to make HD Glow Face Mask: ప్రస్తుతం వాతావరణ కాలుష్యం కారణంగా చాలా మంది తీవ్ర చర్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు నిపుణులు సూచించి ఈ మాస్క్ ప్రతి రోజు వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
How to make HD Glow Face Mask: ప్రతి ఒక్కరూ అందంగా చర్మం మెరుపుతో ఉండేందుకు కోరుకుంటారు. దీని కోసం మార్కెట్‌లో లభించే చాలా రకాల సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల కొంత మందిలో తీవ్ర చర్మ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటికి బదులుగా సౌందర్య నిపుణులు సూచించిన HD గ్లో ఫేస్ మాస్క్‌ను వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయట. ఇందులో ఉండే మూలకాలు చాలా రకాల చర్మ సమస్యలను తగ్గించేందుకు ప్రభావంతంగా సహాయపడతాయి. అంతేకాకుండా చర్మంపై మెరుపును తీసుకు రావడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ HD గ్లో ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో, దీని కావాల్సిన పదార్థాలేంటో?, ఈ మాస్క్‌ను ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ హెచ్‌డి గ్లో ఫేస్ మాస్క్‌ను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల కాఫీలో ఉండే గుణాలు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేటర్‌గా చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా మచ్చలు, నల్లటి వలయాలను తొలగించడానికి కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు ముఖాన్ని అందంగా మార్చేందుకు కూడా దోహదపడుతుంది.
ఈ మాస్క్ తయారికి కావాల్సిన పదార్థాలు:
❁ ఒక టీ స్పూన్ చక్కెర
❁ రోజ్ వాటర్
❁ ½ టీ స్పూన్ మోరింగ పొడి
❁ 1 టీ స్పూన్ కాఫీ పౌడర్
Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?
హెచ్‌డి గ్లో ఫేస్ మాస్క్ తయారి విధానం:
✿ ఈ ఫేస్ ఫ్యాక్ తయారు చేయడానికి ముందుగా ఓ చిన్న గిన్నెను పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
✿ ఈ గిన్నలో ఒక టీస్పూన్ చక్కెర, అర టీస్పూన్ మోరింగా, ఒక టీస్పూన్ కాఫీ వేసుకోవాలి.
✿ ఇలా మూడు పదార్థాలు గిన్నెలో వేసుకున్న తర్వాత ఫైన్‌గా మిక్స్ చేసుకోవాలి.
✿ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే రోజ్ వాటర్ వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.
✿ మిశ్రమంలా తయారు చేసుకున్న మాస్క్‌ను పక్కన పెట్టుకోవాలి. అంతే హెచ్‌డి గ్లో ఫేస్ మాస్క్ తయారైనట్లే..
హెచ్‌డి గ్లో వినియోగించే పద్ధతి:
✿ హెచ్‌డి గ్లో మాస్క్‌ను మూఖానికి అప్లై చేసే ముందు..ముఖాన్ని బాగా కడగాల్సి ఉంటుంది.
✿ ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ మాస్క్‌ను అప్లై చేయాలి.
✿ అప్లై చేసి నాలుగు నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
✿ ఇలా మసాజ్ చేసిన 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
✿ మొత్తం ఆరిన తర్వాత, మంచి నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. ముఖం మృదువుగా, మెరిసే తయారవుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి