Health Benefits Nature Has to Offer: ప్రస్తుత కాలంలో, బిజీగా లైఫ్ స్టైల్ కారణంగా బయట కన్నా ఎక్కువ సమయం ఎ.సి కార్లలో, ఇంట్లోనే లేదా ఆఫీసులలో ఉంటున్నారు. ప్రకృతిలో కేటాయించటానికి సమయమే దొరకట్లేదు. ఏది ఏమైనప్పటికి, ప్రకృతి వలన కలిగే స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను మనం చాలా వరకు కోల్పోతున్నాము. ప్రకృతి వలన మనకు కలిగే లాభాలు, ప్రకృతి నుండి మనకు అందించబడే ఆరోగ్యకర ప్రయోజనాల గురించి మరియు ప్రకృతి వలన మన వ్యాదులు ఎలా తగ్గించబడతాయో వాటి గురించి ఇక్కడ తెలుపబడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్తమా నివారణ
ప్రకృతి వలన ఆస్తమా వ్యాధి తగ్గటం ఏంటి అని అలోచుస్తున్నారా! అవును, ప్రకృతి వలన ఆస్తమా వ్యాధి స్థాయిలు తగ్గుతాయని పరిశోధనలలో నిరూపించబడింది. వాతావరణంలో ఉండే కాలుష్యం వలన ఆస్తమా స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి, కానీ ప్రకృతిలో ఉండే చెట్లు, వృక్షాలు కాలుష్య వాతావరణాన్ని వడపోసి, స్వచ్చమైన గాలిని అందిస్తాయి. అడవుల ప్రాంతాలు లేదా ఇంటి చుట్టూ చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జీవించే చిన్న పిల్లలతో పోలిస్తే, పట్టణాలలో జీవించే పిల్లలు ఎక్కువగా ఆస్తమా వ్యాధికి గురవుతారని ప్రముఖ పరిశోధనలలో వెల్లడించబడింది. 


Also Read: Owaisi Sensational Comments: మోదీకి చైనా గురించి మాట్లాడాలంటే భయం: అసదుద్దీన్‌ ఒవైసీ


గుండె ఆరోగ్యంలో మెరుగుదల
ఏ రకమైన వ్యాయామాలైన ఆరోగ్యకరమే, ఈ వ్యాయామాలను ఇరుకుగా ఉన్న ఇంట్లో కన్నా, చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. పచ్చని చెట్ల మధ్య వ్యాయామాలను అనుసరించటం వలన రక్త పీడనం తగ్గుతుందని మరియు ఆత్మవిశ్వాసంతో పాటుగా, భావోద్వేగ పరంగా మరియు మానసిక పరంగా మంచి ఫలితాలను పొందుతారని పరిశోధనలలో వెల్లడించబడింది.


డిప్రెషన్ నుండి దూరం
రోజులో కొంత సమయం ప్రకృతిలో తిరగటం లేదా కాస్త సమయం కేటాయించటం వలన డిప్రెషన్ సంబంధిత లక్షణాలు తొలగిపోవటమే కాకుండా, మీ మూడ్ కూడా మారుతుందని ప్రయోగశాలలో నిర్దారించబడింది. పార్క్ లకు దగ్గరగా లేదా చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో జీవించే వారి మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.


Also Read: India Vs Pakistan Match: ఐసీసీ ప్రణాళిక ప్రకారం భారత్- పాక్ మ్యాచ్ జరగాల్సిందే: రాజీవ్ శుక్లా


జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది
ప్రకృతిలో సమయం కేటాయించటం వలన మానసిక అలసట తగ్గి,  మెదడు పనితీరు, జ్ఞాపక శక్తి మెరుగుపడటమే కాకుండా కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పట్టణాలలో తిరిగే వారితో పోలిస్తే, చెట్లు ఉన్న ప్రాంతంలో కేవలం 50 నిమిషాల పాటూ తిరిగే వారిలో జ్ఞాపకశక్తి మరియు మెదడు యొక్క పనితీరు బాగుంటాయని పరిశోధనలలో తేలింది.


అల్జీమర్స్ లక్షణాలలో మెరుగుదల
"చాలా కాలం నుండి ఈ వ్యాధితో భాదపడే వారని అయిన కూడా రోజు కొద్ది సమయం పాటూ, తిప్పటం వలన అల్జీమర్ వ్యాధి లక్షణాలు మరియు వ్యాధి తీవ్రతలు తగ్గాయని ఒక పరోశోధనలో తేలింది 


Also Read: Viral Video: అనుమానం పెనుభూతం.. భర్తపై అనుమానంతో జిమ్‌లో మహిళను ఇరక్కొట్టిన భార్య


నిజానికి ఎక్కువ సమయం ప్రకృతిలో తిరగాల్సిన అవసరం లేదు. కేవలం రోజు 15 నిమిషాల పాటూ మాత్రమే గార్డెన్ లేదా చెట్లు ఉన్న ప్రాంతంలో తిరగటం వలన ఒత్తిడి స్థాయిలు, హృదయ స్పందన రేటు మరియు రక్తపీడన స్థాయిలు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు. కేవలం 5 నిమిషాల పాటూ మాత్రమే ప్రకృతిలో గడపటం వలన మీ మూడ్ మారుతుందని మరొక పరిశోధన సంస్థ పేర్కొంది. కావున ఈ రోజు నుండి కొద్ది సమయం పాటైన దగ్గరలో ఉన్న పార్క్ లో సమయాన్ని కేటాయించండి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook