Curry Leaves Tea: కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా..?
Curry Leaves Tea Benefits: కరివేపాకు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే వీటిని కేవలం కూరలకు మాత్రమే కాకుండా దీంతో టీ కూడా తయారు చేసుకొని తీసుకోవచ్చు. దీని వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలు కలుగుతాయి.
Curry Leaves Tea Benefits: కరివేపాకు భారతీయ వంటకాల్లో సుగంధ ద్రవ్యంగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కరివేపాకును వంటలలోనే కాకుండా టీగా కూడా తయారు చేసుకోవచ్చు. దీని తీసుకోవడం బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు:
కరివేపాకు టీ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రేగులో ఉండే నులిపురుగును కూడా తొలిగిస్తుంది. అంతేకాకుండా డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఈ కరివేపాకు టీ తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటుంది. దీని వల్ల మీరు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరం లేదు. అలాగే కరివేపాకు టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుతుంది. దీని వల్ల ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి.
కరివేపాకు టీ తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు. శరీరంలోని కొవ్వును కరిగించడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే ఆహారాని త్వరగా జీర్ణం చేస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. దీని వల్ల చర్మానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. ఇది ముడతలు, చర్మ వ్యాధులను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది.
కరివేపాకు టీ తీసుకోవడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా , ఒత్తుగా పెరుగుతుంది. దీని వల్ల ఎలాంటి జుట్టు సమస్యలు కలగకుండా ఉంటుంది. కరివేపాకు టీ ఒత్తిడి, ఆందోళనలను కూడా తగ్గిస్తుంది. ఇది ఒక రిలాక్సెంట్‌గా పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళలు రుతుస్రావ నొప్పిని తగ్గిస్తుంది. ఇది రుతుస్రావ నొప్పి, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
కరివేపాకు టీ ఎలా తయారు చేయాలి:
కావలసిన పదార్థాలు:
1 కప్పు నీరు
10-15 తాజా కరివేపాకు ఆకులు
1/2 టీస్పూన్ తేనె
1/4 టీస్పూన్ నిమ్మరసం
తయారీ విధానం:
ఒక గిన్నెలో నీరు పోసి మరిగించండి. నీరు మరిగిన తర్వాత, కరివేపాకు ఆకులను వేసి 2 నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి, టీని 5 నిమిషాలు నానినట్లు ఉంచండి. టీని వడగట్టి, ఒక కప్పులోకి పోయాలి. రుచికి తగినట్లుగా తేనె లేదా నిమ్మరసం కలపండి. వేడిగా లేదా గోరువెచ్చగా సేవించండి.
చిట్కాలు:
టీకి మరింత రుచి కోసం, మీరు ఒక చిన్న ముక్క అల్లం లేదా 2-3 యాలకులను కూడా వేసి ఉడికించవచ్చు.
మీరు టీని మరింత గాఢంగా చేయాలనుకుంటే, మీరు ఎక్కువ కరివేపాకు ఆకులను ఉపయోగించవచ్చు.
టీని వడగట్టడానికి, మీరు ఫిల్టర్ లేదా సన్నని గుడ్డను ఉపయోగించవచ్చు.
కరివేపాకు టీని రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు తాగవచ్చు.
గమనిక:
గర్భిణీ స్త్రీలు లేదా పాలిచ్చే మహిళలు కరివేపాకు టీని తాగడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.
రక్తం పలుచబడే మందులు వాడే వ్యక్తులు కూడా కరివేపాకు టీని తాగడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.
కరివేపాకు టీ ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పానీయం, ఇది అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సులభమైన వంటకంతో ఇంట్లోనే తయారు చేసుకోండి దాని ప్రయోజనాలను ఆస్వాదించండి!
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి