Lemon Peel Benefits: నిమ్మరసం కంటే నిమ్మ తొక్కలతోనే శరీరానికి ఎక్కువ మేలు!
Benefits of Lemon Peel Powder: నిమ్మరసం ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో..నిమ్మ తొక్కతో తయారు చేసిన పొడిని వినియోగించడం వల్ల కూడా అన్ని రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Health Benefits of Lemon Peel: నిమ్మరసం శరీరానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది. ప్రతి రోజు నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో దానిపై పీల్ వినియోగించడం వల్ల కూడా అన్నే ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతన్నారు. ఈ తొక్కలో బయోయాక్టివ్ సమ్మేళనాలు అధిక పరిమాణాలు లభిస్తాయి. దీనిని పొడిలా తయారు చేసుకుని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
నిమ్మ తొక్కలో లభించే పోషకాలు ఇవే:
ఈ తొక్క చాలా తక్కువ పరిమాణంలో ఉన్న చాలా రకాల పోషకాలు దాగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 6 గ్రముల నిమ్మ తొక్క పొడిలో 1 గ్రాము ఫైబర్, 3 కేలరీలు, 90 శాతం విటమిన్ సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం కూడా లభిస్తుంది.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
నోటిని ఆరోగ్యంగా ఉంచుతుంది:
నిమ్మ తొక్కలో 4 సమ్మేళనాలు ఉంటాయి. ఇవే కాకుండా ఇందులో యాంటీ బాక్టీరియల్ కూడా లభిస్తుంది. నిమ్మ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల నోటిలో పేరుకుపోయిన బ్యాక్టీరియాను చంపుతుంది. అంతేకాకుండా బ్యాక్టీరియా వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి నోటిని రక్షిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి:
నిమ్మ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు విపరీతంగా ఉంటాయి. ఈ పొడిని నీటిలో కలుపుకుని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా తీవ్ర వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. ముఖ్యంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నీటిని తాగాల్సి ఉంటుంది.
యాంటీ బయాటిక్:
నిమ్మ తొక్కలో యాంటీబయాటిక్ లక్షణాలు కూడా లభిస్తాయి. దీనిని చర్మానికి వినియోగించడం వల్ల ఫంగస్, చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ ఇన్ఫెక్షన్లతో పోరాడి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి