Cold Milk Benefits: పాలు ఆరోగ్యానికి చాలా మంచివని అందరికీ తెలుసు. అయితే కోల్డ్‌మిల్క్ ఎంత మేలు చేస్తుందో చాలా తక్కువమందికి తెలుసు. కోల్డ్‌మిల్క్ తాగితే బరువు తగ్గుతారని మీకు తెలుసా..ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలు ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టే పిల్లలకు ప్రతిరోజూ పాలు తప్పకుండా తాగిస్తుంటారు తల్లిదండ్రులు. ఎందుకంటే పాలలో కాల్షియం, ప్రోటీన్లు, పొటాషియం వంటి న్యుట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా ఎక్కువమంది వేడి పాలు లేదా నార్మల్ పాలు తాగుతుంటారు. కానీ కోల్డ్‌మిల్క్ మీ ఆరోగ్యానికి చాలా మంచిదనే విషయం తెలుసా. నిజమే కోల్డ్‌మిల్క్ ఆరోగ్యానికి ప్రయోజనమే కాకుండా..రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. నచ్చిన ఫ్లేవర్ మిక్స్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. అసలు కోల్డ్‌మిల్క్‌తో కలిగే లాభాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం...


స్థూలకాయంతో బాధపడేవారికి ఇదొక మంచి ఉపాయం. బరువు తగ్గేందుకు కోల్డ్‌మిల్క్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కోల్డ్‌మిల్క్ జీర్ణమయ్యేందుకు శరీరంలో ఈ పాలు నార్మల్ ఉష్ణోగ్రతకు మారుతుంది. ఇది శరీరంలోపల అంతర్గతంగా జరిగేది. దీనివల్ల చాలా కేలరీలు బర్న్ అవుతాయి. అందుకే కోల్డ్‌మిల్క్ తాగడం వల్ల బరువు సులభంగా తగ్గుతుంది. కోల్డ్‌మిల్క్ తాగడం వల్ల చాలా సేపటి వరకూ కడుపు నిండుగా ఉండి..ఎక్కువగా తినలేం. ఫలితంగా ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది. 


కోల్డ్‌మిల్క్ అనేది కడుపుకు చాలా మంచిది. ఇది కడుపును చల్లగా ఉంచుతుంది. దాంతోపాటు మలబద్ధకం సమస్య తలెత్తదు. కోల్డ్‌మిల్క్ తాగడం వల్ల పెప్టిక్ అల్సర్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. ఒకవేళ మీకు ఎసిడిటీ లేదా మలబద్ధకం సమస్య ఉంటే..రోజూ ఒక గ్లాసు కోల్డ్‌మిల్క్ తాగాల్సి ఉంటుంది. 


గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్స్ చేసిన తరువాత ఎనర్జీ డ్రింక్స్ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఎనర్జీ డ్రింక్ స్థానంలో కోల్డ్‌మిల్క్ తాగితే చాలా మంచిది. పాలలో కేలరీస్, విటమిన్స్, మినరల్స్ వంటి చాలా పోషక పదార్ధాలు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. 


Also read: Dark Circles: కళ్ల కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా... అయితే ఇది మీ కోసమే..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook