Body Detox: మనిషి శరీరంలోపల ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం లభిస్తుంది. శుభ్రంగా ఉండటమంటే..అంతర్గతంగా డీటాక్స్ చేయాల్సిన అవసరం. మరి ఎప్పుడెప్పుడు శరీరాన్ని డీటాక్స్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరం బాహ్య శుభ్రత ఎంత అవసరమో అంతర్గత శుభ్రత కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది. శరీరంలో పేరుకుపోయే వ్యర్ధాలు తీవ్ర సమస్యల్ని సృష్టించే అవకాశాలున్నాయి. ఆరోగ్యంగా ఉండేందుకు శరీరంలో పేరుకున్న వ్యర్ధాల్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. జంక్ ఫుడ్, కావల్సినంత నీరు తాగకపోవడం, వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోయేందుకు దోహదమౌతాయి. 


అయితే చాలామందికి శరీరాన్ని ఎందుకు డీటాక్స్ చేయాలనే సందేహం రావచ్చు. లేదా ఎప్పుడెప్పుడు డీటాక్స్ చేయాలనే ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. శరీరంలో విషపదార్ధాలు ఎక్కువైనప్పుడు మీ శరీరం అందుకు సంబంధించిన సంకేతాలు వెలువరిస్తుంది. ఆ సంకేతాలేంటి, ఎప్పుడు శరీరాన్ని డీటాక్స్ చేయాలనేది తెలుసుకుందాం..


మీ నోటి నుంచి దుర్వాసన వస్తుంటే లేదా శరీరంపై చెమట నుంచి చెడు వాసన వస్తున్నా మీ శరీరంలో విషపదార్ధాలు పేరుకున్నాయని అర్ధం. మీ శరీరంలో చాలా రకాల విష పదార్ధాలు పేరుకుపోతుంటాయి. దాంతో ఎక్కువ చెమట పడుతుంది. అదే సమయంలో మీ శ్వాస కూడా చెడు వాసన కల్గిస్తుంది. మీకు కూడా ఈ సమస్యలు  ఎదురైతే మీ శరీరాన్ని డీటాక్స్ చేయాల్సిన సమయం వచ్చిందని అర్ధం చేసుకోవచ్చు.


కడుపు ఉబ్బిపోవడం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా శరీరాన్ని డీటాక్స్ చేయాల్సిన అవసరాన్ని సూచిస్తాయి. ఎందుకంటే ప్రేగుల్లో పేరుకున్న వ్యర్ధాలు, విష పదార్ధాలు మీ జీర్ణశక్తిని పాడుచేస్తాయి. కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. మీ కడుపు పాడై ఉంటే లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు ఎదురైనా శరీరాన్ని డీటాక్స్ చేయాల్సిందే. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో మూడ్ పాడవడం, విసుగు, పనిలో ఆసక్తి లేకపోవడం శరీరంలో విష పదార్ధాలు పేరుకుపోవడం వల్లనే జరుగుతుంది. ఎందుకంటే విష పదార్ధాలు శరీరం మెటబోలిజంను ప్రభావితం చేస్తాయి. హార్మోన్ సమతుల్యత సరిగ్గా ఉండాలంటే..మెటబోలిజం కూడా సరిగ్గా ఉండాల్సిందే. అందుకే శరీరాన్ని డీటాక్స్ చేయాలి. 


ఇక చర్మ సంబంధిత సమస్యలు కూడా శరీరంలో వ్యర్ధాలకు కారణంగా ఉంటుంటాయి. మీ రక్తాన్ని అశుద్ధం చేసేస్తాయి. చర్మంపై ముడతలు, పింపుల్స్, మచ్చలు ఇందుకు కారణాలు. ఇవికాకుండా హార్మోన్ అసమతుల్యత, చర్మ సంబంధిత సమస్యలు ఎదురౌతుంటే..శరీరాన్ని డీటాక్స్ చేయాలని అర్దం. 


Also read: Bones Strong Tips: మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే.. వీటిని డైట్ లో చేర్చుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి