Lip care Tips: అందమైన పెదవులు అందాన్ని రెట్టింపు చేస్తాయి. అందుకే అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా లిప్‌కేర్ చాలా అవసరం. తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల వల్ల పెదవులు నల్లగా మారుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందమైన పెదవుల కోసం అమ్మాయిలు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్‌లో లభించే అన్ని రకాల లిప్‌స్టిక్ షేడ్స్, లిప్‌గ్లాస్ ఉపయోగిస్తుంటారు. పెదవులు సహజసిద్దమైన పింక్ రంగులో ఉంటే ఆ అందమే వేరు. ఏజీయింగ్, సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ అవడమనేది పెదాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంటాయి. ఫలితంగా పెదాలు నల్లగా కన్పిస్తాయి. నల్లగా కన్పించకుండా ఉండేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మీరు చేసే తప్పుల వల్లనే పెదాలు అలా తయారవుతుంటాయి. మీరు చేసే ఆ తప్పులేంటో చూద్దామిప్పుడు. 


పెదవుల అందం పెంచేందుకు లిప్‌స్టిక్ అనేది కీలకం. కానీ ఖర్చు తగ్గించుకునే క్రమంలో కొంతమంది అమ్మాయిలు లోకల్ లిప్‌స్టిక్స్ వాడుతుంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. లోకల్ లిప్‌స్టిక్స్ వాడటం వల్ల మీ పెదాలు నల్లగా మారుతాయి. ఎందుకంటే లోకల్ లిప్‌స్టిక్స్‌లో వినియోగించే ఇంగ్రెడియెంట్స్ నాణ్యత సరిగ్గా ఉండవు. ఈ క్రమంలో ఇంట్లోనే సహజసిద్ధమైన వస్తువులతో టింట్ తయారు చేసుకుని పెదవులకు రాసుకుంటే మంచి ఫలితాలుంటాయి.


ఇంకొంతమంది ఒకసారి కొనుగోలు చేసిన లిప్‌స్టిక్స్‌ను ఏళ్ల తరబడి వాడుతుంటారు. ఆ లిప్‌స్టిక్ ఎక్స్‌పైర్ అయిందో లేదో కూడా గమనించరు. ఎక్స్‌పైర్ అయిన లిప్‌స్టిక్స్ పొరపాటున కూడా వాడకూడదు. ఎందుకంటే ఇవి మీ పెదాలకు హాని కల్గిస్తాయి. కొంతమంది మహిళలు ఎండలో బయటకు వెళ్లేటప్పుడు లిప్‌స్టిక్ రాసుకుని వెళ్తుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఎండకు పెదాలు పాడైతే..లిప్స్ నల్లగా మారిపోతాయి. లిప్‌కేర్ విషయంలో సరైన శ్రద్ధ తీసుకోకపోతే..చాలా మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుంది. 


Also read: Health Tips: మహిళలతో పోలిస్తే..పురుషులకే ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అవసరం, ఎందుకు



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook