Health Tips: మహిళలతో పోలిస్తే..పురుషులకే ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అవసరం, ఎందుకు

Health Tips: ఆధునిక పోటీ ప్రపంచంలో అందరికీ ఆరోగ్యంపై ధ్యాస చాలా అవసరం. ముఖ్యంగా మగవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీర్ఘకాలం యౌవనంగా, ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కొన్ని సూచనలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 11, 2022, 09:07 PM IST
Health Tips: మహిళలతో పోలిస్తే..పురుషులకే ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అవసరం, ఎందుకు

Health Tips: ఆధునిక పోటీ ప్రపంచంలో అందరికీ ఆరోగ్యంపై ధ్యాస చాలా అవసరం. ముఖ్యంగా మగవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీర్ఘకాలం యౌవనంగా, ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కొన్ని సూచనలు మీ కోసం..

ప్రస్తుత ఆధునిక పోటీ ప్రపంచంలో, ఉరుకులు పరుగుల జీవితంలో పని ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లతో ఆరోగ్యం ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా పురుషుల ఆరోగ్యం ప్రశ్నార్ధకమౌతోంది. అందుకే పురుషులు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని టిప్స్ పాటిస్తే పురుషులు ఎక్కువకాలం యౌవనంగా కన్పించడమే కాకుండా..ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

మీక్కూడా దీర్ఘకాలం ఆరోగ్యంగా, యౌవనంగా కన్పించాలనే ఆశ ఉంటే..ఈ టీప్స్ పాటించండి. ప్రతిరోజూ ఉదయం త్వరగా నిద్రలేవాలి. ఆలస్యంగా నిద్ర లేవడమనేది ఆరోగ్యానికి మంచిది కాదు. లేవగానే ఓ గ్లాసు నీళ్లు తాగాలి. రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలి. వ్యాయామం మీ శరీరానికి శక్తినిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. నిర్ణీత పద్ధతిలో వ్యాయామం చేస్తే..బాడీ మెటబోలిజం కూడా మెరుగవుతుంది. ఫలితంగా దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటారు. 

నెవర్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్

ఉదయం వేళ అల్పాహారం లేదా బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ వదలకూడదు. ఉదయం లేవగానే..రెండు గంటల్లోగా బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ హెవీగా ఉండటమే మంచిది. పురుషులు దీర్ఘకాలం యౌవనంగా ఉండాలంటే..జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో రెండు అరటిపళ్లు, దానిమ్మ లేదా జ్యూస్ కూడా అల్పాహారంలో తీసుకోవచ్చు.

ఆఫీసు లేదా ఇంటికి లిఫ్ట్ కాకుండా మెట్ల మార్గం ఉపయోగిస్తే మంచిది. మెట్లెక్కడం, దిగడం రెండూ చేయాల్సిందే. ఆఫీసులో ఫోన్ తక్కువగా ఉపయోగించాలి. ఆఫీసులో మీ పని మీరు స్వయంగా చేసుకోవడం ద్వారా ఎక్కువ మూమెంట్ ఇస్తే మంచిది. ఎందుకంటే బాడీ ఎక్కువసేపు ఒకే స్థితిలో ఉంటే.. సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఆఫీసులో గంటా రెండు గంటలు కంటిన్యూగా కూర్చోకూడదు.

ఒత్తిడి అనేది జీవితంలో దుష్పరిణామాలకు దారితీస్తుంది. ఒత్తిడి తగ్గించేందుకు రోజూ కనీసం అరగంట సేపు మానసిక ప్రశాంతత లభించే పనులు చేయాలి. పాటలు వినడం, సినిమా చూడటం, పుస్తక పఠనం వంటివి మనసుకు ఆహ్లాదమిస్తాయి. దాంతోపాటు సరైన నిద్ర మనిషికి చాలా అవసరం. దీనివల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. ఫిట్‌గా ఉంటారు. 

Also read: Supermoon 2022: సూపర్‌మూన్ అంటే ఏంటి, ఎలా ఏర్పడుతుంది, ఎప్పుడు కన్పిస్తుంది

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News