Dark Circles: కంటి కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారా..ఇవి అప్లై చేయండి చాలు
Dark Circles: ఆధునిక బిజీ లైఫ్ స్టైల్..అందంపై దుష్ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా కంటి కింద నల్లటి వలయాలు, డార్క్ సర్కిల్స్ ప్రధాన సమస్యగా మారుతోంది. డార్క్ సర్కిల్స్ నుంచి విముక్తి పొందే మార్గాలేమున్నాయో చూద్దాం..
Dark Circles: ఆధునిక బిజీ లైఫ్ స్టైల్..అందంపై దుష్ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా కంటి కింద నల్లటి వలయాలు, డార్క్ సర్కిల్స్ ప్రధాన సమస్యగా మారుతోంది. డార్క్ సర్కిల్స్ నుంచి విముక్తి పొందే మార్గాలేమున్నాయో చూద్దాం..
కళ్ల కింద నల్లటి వలయాలు అంటే డార్క్ సర్కిల్స్ ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారింది. రోజంతా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ముందు ఉండటం, గంటల తరబడి పని చేస్తుండటం, నిద్ర సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత లేకపోవడంతో డార్క్ సర్కిల్స్ అధికమౌతున్నాయి. కంటి కింద డార్క్ సర్కిల్స్ దాచడమనేది అసాధ్యమే. మేకప్ ద్వారా కొద్దిగా తగ్గించవచ్చు గానీ..పూర్తిగా నియంత్రించలేం. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే తప్పకుండా కంటి కింద నల్లటి వలయాలు తొలగించవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.
బంగాళదుంప రసం
బంగాళదుంపలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కంటి కింద నల్లటి వలయాలపై క్రమం తప్పకుండా బంగాళదుంప రసం రాయడం వల్ల నెమ్మదిగా ఆ డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. దూది సహాయంతో మృదువుగా అప్లై చేయాలి. టీ బ్యాగ్స్‌లో ఉండే కెఫీన్ రక్త నాళికల్ని సంకోచించేలా చేస్తాయి. రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి. ఫలితంగా డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. వాడేసిన గ్రీన్ టీ బ్యాగ్స్ కళ్ల కింద పెట్టుకుంటే మంచి ఫలితాలుంటాయి.
కోల్డ్ మిల్క్ చర్మానికి చాలా మంచిది. డార్క్ సర్కిల్స్ తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఓ గిన్నెలో చల్లటి పాలు తీసుకోండి. దూదిని ఆ పాలలో ముంచి కళ్ల కింద రాయాలి. ఇలా పది నిమిషాలసేపు చేయాలి. చివరిగా చల్లని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి.
Also read: High Blood Pressure: వర్షాకాలంలో రక్తపోటు మరింతగా పెరగనుందా..యోగాతో చెక్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook