Telangana Eamcet 2022: తెలంగాణలో భారీ వర్షాలు మరో 2-3 రోజులు కొనసాగనున్నాయని వాతవారణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ పరిస్థితి ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలపై పడనుందా..
తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే కడెం ప్రాజెక్టు ప్రమాదకరస్థాయికి చేరుకుంది. నీటిమట్టం సామర్ధ్యం 7.6 టీఎంసీలు కాగా, ఇప్పటికే 7.2 టీఎంసీల నీరు చేరుకుంది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జనం బయటకు రావద్దనే అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో 11 జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జనగామ, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటితమైంది.
ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షల నిర్వహణ ఎలా
ఈ నేపధ్యంలో విద్యాసంస్థలకు సెలవులు కూడా పొడిగించింది ప్రభుత్వం. శనివారం వరకూ అంటే మరో మూడు రోజులు సెలవుల్ని పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు, ఎల్లుండ అంటే జూలై 14, 15 తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షల్ని ఇప్పటికే ప్రభుత్వం వాయిదా వేసింది. కానీ జూలై 18, 19, 20 తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షల్ని యధావిధిగా నిర్వహించనున్నట్టు తెలిపింది. కానీ 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితుల్లో సోమవారం నుంచి అంటే జూలై 18 నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షల నిర్వహణ ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పరీక్షల నిర్వహణపై చివరి క్షణం వరకూ వేచి చూసి..విద్యార్ధుల్ని సందిగ్దంలో పడేసేకంటే..ముందుగా నిర్ణయం తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడా ఎంసెట్ ఏర్పాట్లు జరగలేదు. అటు 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటన, విద్యాసంస్థలకు శనివారం వరకూ సెలవుల పొడిగింపు నేపద్యంలో జూలై 18, 19, 20 తేదీల్లో పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ నిర్విహించినా..ఎక్కడికక్కడ రాకపోకలు పూర్తిగా స్థంభించి..రహదారులు కొట్టుకుపోయిన నేపధ్యంలో చాలా ప్రాంతాల్లో విద్యార్ధులక రాకపోకలకు సమస్య ఏర్పడుతుంది.
కేవలం ఎంసెట్ అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలు వాయిదా వేస్తే సరిపోదని..ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు కూడా వాయిదా వేస్తే విద్యార్ధులకు మంచి జరుగుతుందనేది సర్వత్రా విన్పిస్తున్న మాట.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook