Muskmelon benefits in Summer: వేసవి కాలం స్టార్ట్ అయింది. ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ సమయంలో మనం ఎక్కువగా డీహైడ్రేషన్ బారిన పడతాం. దాని నుండి బయటపడటానికి ఎక్కువగా నీళ్లు, జ్యూస్ తాగడం, పళ్లు తినడం లాంటివి చేయాలి. ఎండాకాలంలో వేడి నుండి ఉపశమనం కలిగించే పండ్లలో కర్భూజ ఒకటి. ఇది దోస జాతికి చెందిన ఫ్రూట్. దీనిని తినడంతోపాటు జ్యూస్ కూడా తాగుతారు. ఇందులో అధిక మెుత్తంలో నీరు ఉంటుంది. అంతేకాకుండా ఈ పండు పైబర్, విటమిన్లు, కాల్షియం, ఐరన్, సోడియం వంటి ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. ఇది ఎన్నో రకాల జబ్బులను కూడా దూరం చేస్తుంది. కర్భూజ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్భూజ పండు తినడం వల్ల ప్రయోజనాలు
** కర్భూజ పండు తినడం వల్ల బాడీ డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది.
** గుండెల్లోని మంటలను తగ్గించడంలో కర్భూజ సూపర్ గా పనిచేస్తుంది.
** ఇందులో ఉండే యాంటియాక్సిడెంట్లు స్థూలకాయం లేదా ఉబకాయాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
** ఈ పండులో అధిక మెుత్తంలో ఆర్గానికి ఫిగ్మెంట్ కెరోటినాయిడ్ ఉంటుంది. ఇది క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. 
** కర్బూజలో విటమిన్-ఏ, బీటా కెరొటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ల పనితీరును మెరుగుపరుస్తుంది.
** రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. తద్వారా మధుమేహాన్ని దూరం చేస్తుంది. 
** ఇది పంటి నొప్పిని తగ్గించడంతోపాటు గర్బిణీలకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
**  కర్బూజ బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. అంతేకాకుండా ఆజీర్తి, మూత్ర సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. 
**  ఈ పండు బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుంది. 


Also Read: Coconut Water Benefits: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook