Side effects of eating Banana: అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మెగ్నీషీయం, మాంగనీస్, బయోటిన్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని తీసుకోమని డాక్టర్లు సూచిస్తారు. దీనిని తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. అరటిపండును ఎక్కువగా తీసుకోవడం కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అరటిపండు తినడం వల్ల కలిగే నష్టాలు
** అధిక బరువుతో బాధపడేవారు అరటిపండుకు దూరంగా ఉండండి. ఎందుకంటే దీనిని తింటే వెయిట్ పెరుగుతారు తప్ప తగ్గరు.
** ఎలర్జీ సమస్య ఉన్నవారు కూడా బనానా తినకపోవడం మంచిది. ఎందుకంటే అరటి పండు ఈ ప్రాబ్లమ్ ను మరింత పెంచుతుంది. 
** మైగ్రేన్ తో బాధపడేవారు కూడా దీనికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే టైరమైన్ అనే పదార్థం వల్ల మీ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. 
** బనానా అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల మీకు మలబద్దకం కూడా వచ్చే అవకాశం ఉంది. 
** బనానాలో ప్రక్టోజ్ అధికంగా ఉంటుంది. దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మీకు కడుపులో గ్యాస్ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. 
** హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు వీలైనంత వరకు అరటి పండును తినకుండా ఉండే మంచిది. దీనిలో ఉండే పోటాషియం వ్యాధి తీవ్రతను మరింత పెంచే అవకాశం ఉంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Apple Side Effects: యాపిల్స్ ఎక్కువగా తింటే అంతే సంగతి.. మీరు ఈ జబ్బులు కొని తెచ్చుకున్నట్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook