Immunity Boost Drinks: ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది!
Healthy drinks to boost immunity: సాధారణంగా శీతాకాలంలో సీజనల్ వ్యాధులు బారిన పడుతుంటాము. దీనికి ముఖ్య కారణం మనలో రోగనిరోధక శక్తి అనేది చలికాలంలో చాలా తక్కువగా ఉంటుంది. అయితే కొన్ని రకాల హెల్త్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడాల్సిన అవసరం లేదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Healthy drinks to boost immunity: చలికాలంలో సీజనల్ వ్యాధుల కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. దీని వల్ల శరీరం ఎంతో నీరసంగా , ఆలసటగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో విటమిన్, మినరల్స్ తగ్గువగా ఉండటం వల్ల మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యల తలెత్తుతాయి. అయితే ఈ వింటర్ సీజన్‌లో కొన్ని ఆరోగ్యకరమైన డ్రింక్స్ తీసుకోవడం వల్ల మలబద్ధకం, నీరసం, అలసట వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో చాలా మంది నీరును తక్కువగా తీసుకుంటారు. దీని కారణంగా అనారోగ్యసమస్యల బారిన పడుతుంటారు. అయితే నీటికి బదులుగా కొన్ని జ్యూసులను తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. దీని కోసం మనం ఇంట్లో లభించే ఆహార పదార్థాలు తీసుకుంటే సరిపోతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
వేడి నీళ్ళు:
వేడి నీళ్ళు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చు. అయితే నిమ్మకాయ, ఆరెంజ్, పుదీనా, అల్లం, దోసకాయ ముక్కలును గోరువెచ్చని నీళ్ళులో వడపోసుకొని చియా గింజలు, తేనెను కలిపి తీసుకోవడం వల్ల డిటాక్సిఫైయర్‌గా ఉపయోగపడుతుంది.
సూప్:
సూప్‌ను చిలికాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. నల్ల మిరియాలతో జోడించడం చాలా సహాయపడుతుంది.
హెర్బల్ టీ:
పుదీనా, గ్రీన్ టీ ఆకులు, చమోమిలే, అల్లం, నిమ్మ వంటి హెర్బల్ టీలను తీసుకోవడం వల్ల ఒమేగా- 3 ఎఫ్ ఎఫ్ ఎ లభిస్తుంది.
సత్తు జ్యూస్:
ఈ జ్యూస్ కోసం గోరువెచ్చని నీటిలో చిటికెడు నల్ల ఉప్పు, నిమ్మరసం కలపాలి. దీనీ తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి, ప్రోటీన్ లభిస్తుంది. మహిళలు, గర్భిణీ స్త్రీలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
హాట్ ఫ్రూట్ పంచ్:
ఈ ఫ్రూట్ పంచ్ కోసం ఆరెంజ్, పైనాపిల్, యాపిల్ లను జ్యూస్ చేసి తీసుకోవాలి. తరువాత ఒక సాస్పాన్‌లో వేడి చేసి దాల్చిన చెక్క,జాజికాయ,దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకోవాలి. ఇరువై నిమిషాలు పాటు వేడి చేసుకోవాలి. దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.
పసుపు పాలు:
కప్పు పాలు, చిటికెడు పసుపు పొడి, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క,అల్లం తీసుకోవాలి. శీతాకాలంలో ఇన్ఫెక్షన్‌లను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Also Read Almonds: టీనేజ్ లోనే ముఖంపై ముడుతలు వస్తున్నాయా..?.. బాదాంను ప్రతిరోజు ఇలా ట్రై చేయండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter