ఆరోగ్యంగా ఉండాలంటే అన్నింటికంటే ప్రధానమైంది సరైన నిద్ర. నిద్ర సరిగ్గా ఉంటే రక్తపోటు సహా చాలా వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చు. అదే సమయంలో శరీరానికి అవసరమైన ఎనర్జీ కూడా లభిస్తుంది. కానీ చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మొత్తం ఆరోగ్యమే క్షీణించే ప్రమాదముంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్యానికి ఆహారపు అలవాట్లే కాదు జీవనశైలి కూడా చాలా ముఖ్యం. అంటే ప్రతిరోజూ తగినంత నిద్ర తప్పనిసరిగా ఉండాలి. రోజూ తగినంత నిద్ర ఉంటే..అధిక రక్తపోటు వంటి చాలా సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అటు శరీరానికి కావల్సిన ఎనర్జీ కూడా లిస్తుంది. అయితే ఇదంతా తెలిసిన వివిధ కారణాలతో చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. డిన్నర్ సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్ల కారమంగా ఈ పరిస్థితి తలెత్తుతుంది. డిన్నర్ సమయంలో చేయకూడని ఆ తప్పులేంటో తెలుసుకుందాం..


డిన్నర్ తరువాత చేయకూడని తప్పులు


కొంతమంది డిన్నర్ చేసిన తరువాత అలాగే కూర్చుండిపోతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల కడుపులో గ్యాస్ సమస్య తలెత్తుతుంది. ఎందుకంటే మీరు తినే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా నిద్ర సరిగ్గా ఉండదు. అందుకే రాత్రి భోజనం చేసిన తరువాత కనీసం ఓ అరగంట లైట్ వాకింగ్ చేయాలి.


భోజనానంతరం ఎక్కువ నీళ్లు తాగడం


ఇది కూడా సాధారణంగా అందరూ చేసే తప్పిదం. చాలామంది భోజనం చేసిన తరువాత ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగుతుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ డైల్యూట్ అవుతాయి. దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఎప్పుడైతే ఆహారం సరిగ్గా జీర్ణం కాలేదో..కడుపు ఉబ్బరంగా ఉండి..పలు సమస్యలు తలెత్తుతాయి.


కొంతమందికి చాలా వేగంగా, హడావిడిగా భోజనం చేసే అలవాటుంటుంది. భోజనం వేగంగా తినడం వల్ల జీర్ణ సమస్య ఏర్పడుతుంది. తిన్న ఆహారం జీర్ణం కానప్పుడు కడుపు ఉబ్బరంగా ఉండి..పలు సమస్యలు ఉత్పన్నమౌతాయి. అటు బరువు కూడా పెరుగుతారు.


Also read: Cervical Problems: ఆ నొప్పి అత్యంత భయంకరం. వచ్చిందంటే బతుకు దుర్భరమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook