Sleep Time: ఆధునిక పోటీ ప్రపంచంలో జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఎప్పుడు తింటారో తెలియదు, ఎప్పుడు నిద్రపోతారో తెలియదు. పలు అనారోగ్య సమస్యలకు ఇదే కారణమౌతుంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎప్పుడు నిద్రపోవాలి, త్వరగా నిద్రపోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తగిన నిద్ర చాలా అవసరం. అది కూడా రాత్రి వేళ త్వరగా నిద్రించి..ఉదయం త్వరగా లేవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. అందుకే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అన్నారు. దురదృష్టవశాత్తూ ఆధునిక పోటీ ప్రపంచంలో బిజీగా ఉండటం వల్ల ఎప్పుడు నిద్రపోతున్నారో, ఎప్పుడు తింటున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. నిత్యం బీజీగా ఉండటం వల్ల వీలు కుదిరినప్పుడు లేదా పని పూర్తయినప్పుడు నిద్రపోవడం తప్ప సమయానికి నిద్రపోవడం అనేది ఉండటం లేదు. కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ సమయానికి నిద్రపోవాలి. ముఖ్యంగా త్వరగా నిద్రించి త్వరగా లేవడం మంచిది. 


శరీరంలోని అలసటను నిర్మూలించి తాజాదనాన్ని ఇచ్చేది నిద్ర మాత్రమే. మరి ఈ పరిస్థితుల్లో రాత్రి వేళ ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలనేది తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తికి రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం. అందుకే రాత్రి 10 గంటల్లోగా నిద్రపోవాలి. ఉదయం 6 గంటలకు లేవాలి. ఇది ఆరోగ్యానికి మంచి అలవాటు. ఈ నిద్ర కూడా వయస్సుని బట్టి మారుతుంటుంది. 3-12 నెలల పిల్లలకు రోజుకు 12-16 గంటలు నిద్ర అవసరమౌతుంది. అదే 1-5 ఏళ్ల వయస్సువారికైతే 10-13 గంటల నిద్ర అవసరం. ఇక 9-18 ఏళ్ల వయస్సులోవారికి 8-10 గంటలు నిద్ర కావల్సి ఉంటుంది. 18-60 ఏళ్ల వయస్సువారికి రోజుకు 7-8 గంటల నిద్ర అవసరం.


రాత్రి పూట నిద్ర సరిగ్గా పట్టాలంటే పగలు పడుకోవడం మంచిది కాదు. ఒకవేళ అలసటగా ఉండి పడుకోవాలన్పిస్తే మద్యాహ్నం కేవలం ఓ అరగంట నిద్రిస్తే చాలు. రోజూ తగినంత నిద్ర లేకపోతే చిరాకు, మతిమరుపు, డిప్రెషన్ వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. మధుమేహం, స్థూలకాయం, రక్తపోటు, గుండె జబ్బులు వంటివి రోజూ తగినంత నిద్ర లేకపోవడం వల్లనే వస్తాయి.


నిద్ర కూడా తగినంత మాత్రమే ఉండాలి. తగ్గకూడదు, పెరుగుకూడదు. ఎక్కువగా నిద్రపోవడం కూడా మంచిది కాదు. మనిషికి రోజుకు 7-8 గంటల కంటే నిద్ర ఎక్కువ కాకపోవడమే మంచిది. ఒకవేళ అతిగా నిద్రపోతున్నారంటే..ఆ వ్యక్తికి చికాకు, డిప్రెషన్, గుండె జబ్బులు , మధుమేహం, థైరాయిడ్, ఆస్తమా ఉన్నట్టు  అర్ధం.


Also read: Benefits Of Dates: శరీరానికి తక్షణ శక్తి అందించే వాటిలో ఇది ఒకటి.. ప్రతిరోజు పాలతో ఇలా తీసుకుంటే బోలెడు లాభాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook