Weight Loss Tips: వాస్తవానికి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం లేదా వాకింగ్ చేస్తూ డైటింగ్ పాటిస్తే కచ్చితంగా బరువు తగ్గించుకోవచ్చు. కానీ బిజీ లైఫ్ కారణంగా రోజూ తగిన సమయం కేటాయించక బరువు నియంత్రణ తప్పిపోతుంటుంది. అందుకే ఈ చిట్కా పాటిస్తే కచ్చితంగా మంచి ప్రయోజనాలుంటాయంటున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్థూలకాయం అనేది వాస్తవానికి వ్యాధి కాదు. తగిన సమయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుని నియంత్రించకపోతే వివిధ రకాల వ్యాధులు ఎదురౌతాయి. బిజీ లైఫ్‌లో చెడు ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా స్థూలకాయం ఓ సమస్యగా వేధిస్తుంది. జిమ్‌కు వెళ్లి గంటల తరబడి వర్కవుట్స్ చేసినా ప్రయోజనం కన్పించకపోతే ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. ప్రతి భారతీయుడి కిచెన్‌లో తప్పకుండా లభించే వాముతో అద్భుతంగా బరువు నియంత్రించవచ్చు. వాము నిజంగా ఓ ఆయుర్వేద ఔషధం లాంటిది. ఇందులో ఉండే లో కేలరీల కారణంగా బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరం. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలం. అందుకే వాము తీసుకుంటే జీర్ణక్రియ పటిష్టమౌతుంది. పొట్టు, నడుము చుట్టూ ఉండే బెల్లీ ఫ్యాట్ నయమౌతుంది. 


బరువు తగ్గించేంచుకు వాముతో 4 అద్భుతమైన చిట్కాలు


మెంతులు, కలోంజి, వాము గింజల్ని డ్రై చేసి ఫ్లై చేయాలి. మూడింటినీ కలిపి పౌడర్‌గా చేసుకుని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నింపి ఉంచుకోవాలి. రాత్రి పడుకునేముందు గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ పౌడర్ కలిపి తాగాలి. ఇలా రోజూ నియమిత పద్ధతిలో తాగుతుంటే మంచి ప్రయోజనాలుంటాయి.


వాము నీరు కూడా బరువు నియంత్రించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. వాముని ఎండబెట్టి నీళ్లలో ఉడికించాలి. ఆ తరువాత వడకాచి రోజూ ఉదయం పరగడుపున తాగితే బెల్లీ ఫ్యాట్ అద్భుతంగా తగ్గుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. 


సోంపు, వాము నీళ్లతో కూడా బరువు అద్భుతంగా తగ్గించవచ్చు. ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ సోంపును 4 కప్పుల నీళ్లలో మరగబెట్టి సగానికైన తరువాత ఆ నీళ్లు రోజూ పరగడుపున తాగాలి. ఇక మరో చిట్కా తేనెతో వాము కలిపి తాగడం. రాత్రి వామును నీళ్లలో నానబెట్టి ఉదయం వడకాచి అందులో కొద్దిగా తేనె కలుపుకుని సేవించాలి. కనీసం మూడు నెలలపాటు ఇలా చేస్తే బరువు అద్భుతంగా తగ్గుతుంది.


Also read: Snoring: గురక సమస్య రావడానికి ప్రధాన కారణాలు, వచ్చే ముందు మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook