Snoring: గురక సమస్య రావడానికి ప్రధాన కారణాలు, వచ్చే ముందు మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే..

Snoring Treatment: ప్రస్తుతం చాలామంది యువత గురక సమస్య బారిన పడుతున్నారు అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణం అధిక బరువు మద్యపానం సేవించడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2023, 07:59 PM IST
Snoring: గురక సమస్య రావడానికి ప్రధాన కారణాలు, వచ్చే ముందు మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే..

Snoring Treatment:  రాత్రి లేదా పగలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కొంతమందిలో గురక విపరీతంగా వస్తుంది దీని కారణంగా  మధ్యలోనే మెలకువ వస్తుంది. అయితే తరచుగా ఇలానే జరిగితే తీవ్ర అనారోగ్య సమస్యలకు సంకేతం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు గురక పెట్టే వారిలో ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుందని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గురక కారణంగా కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి దీనివల్ల ప్రాణానికే ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. అయితే గురక సమస్య వచ్చే ముందు కొంతమందిలో ఈ క్రింది లక్షణాలు వస్తాయి. ఇలాంటి లక్షణాలు వచ్చేముందు పల్లి రకాల జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గురక లక్షణాలు:
✾ నిద్రపోతున్న సమయంలో గట్టిగా ఊపిరి పీల్చుకోవడం
✾ సోమరితనం
✾ తరచుగా అలసిపోయినట్లు అనిపించడం
✾ కొంతమందిలో ఉదయం తలనొప్పి వచ్చే అవకాశాలు
✾ అతిగా నిద్రపోవడం
✾ జ్ఞాపక శక్తి తగ్గిపోవడం
✾ మానసిక ప్రశాంతత లేకపోవడం
✾ మానసిక ఒత్తిడి 

Also Read: Shri Krishna Janmashtami 2023: శ్రీకృష్ణుడి వీడ్కోలు తరువాత తల్లిదండ్రులకు ఏమయ్యారు..? ఆ నలుగురు ఎలా చనిపోయారు..?  

గురక రావడానికి ప్రధాన కారణాలు:

బరువు పెరగడం:
అధిక బరువు పెరగడం కారణంగా చాలామందిలో దీర్ఘకాలిక వ్యాధులు రావడమే కాకుండా గురక వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెయిట్ పెరగడం కారణంగా చాలామందిలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు బిగ్గరగా గురక వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి బరువు తగ్గాల్సి ఉంటుంది.

మద్యపానం సేవించడం:
మద్యపానం సేవించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు సేవించడం వల్ల ప్రాణానికి ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అతిగా ఆల్కహాల్ తీసుకునే వారిలో గురక సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా మద్యపానం సేవించేవారు సులభంగా ఈ సమస్య బారిన పడడమే కాకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా పడుతున్నారు.

వృద్ధాప్యం:
60 నుంచి 70 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు కూడా గురక సమస్య బారిన పడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్యం వణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎంత సులభంగా గురకను నియంత్రించుకుంటే అంత మంచిది లేదంటే ప్రాణానికే ప్రమాదమని నిపుణులు భావిస్తున్నారు.

Also Read: Shri Krishna Janmashtami 2023: శ్రీకృష్ణుడి వీడ్కోలు తరువాత తల్లిదండ్రులకు ఏమయ్యారు..? ఆ నలుగురు ఎలా చనిపోయారు..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News