Mens Health: ఖర్జూరం అంటే ఇష్టపడనివారుండరు సాధారణంగా. ఖర్జూరంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా పురుషులు ఎదుర్కొనే అంతర్గత సమస్యలకు ఖర్జూరం సరైన పరిష్కారమంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా పని ఒత్తిడిలోనే లేదా ఉద్యోగంలోనో పడి పురుషులు ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ వహించరు. అందుకే పెళ్లి తరువాత మగవారి జీవనశైలి చాలావరకూ మారిపోతుంటుంది. ముందున్నత ఫిట్ అండ్ హెల్తీ పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. హెల్తీ ఫుడ్ తినకపోవడమే ఇందుకు కారణం. ఈ పరిస్థితుల్లో పురుషులకు ఖర్జూరం అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల ఇన్‌స్టంట్ ఎనర్జీ లభించడం ఖాయం. ఖర్జూరంలో ఉండే కాల్షియం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ కే, ప్రోటీన్, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు మనిషిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎందుకంటే ఒక ఖర్జూరంలో శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా మగవారి అంతర్గత సమస్యలకు కూడా ఖర్జూరం అద్భుతమైన పరిష్కారాన్నిస్తుంది.


ఖర్జూరంతో చాలా లాభాలున్నాయి. ముఖ్యంగా ఎముకలు బలంగా మారతాయి. ఎముకలు బలహీనంగా ఉండటం వల్ల శరీరంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజువారీ డైట్ లో ఖర్జూరం భాగంగా చేస్తే మంచి ఫలితాలుంటాయి. కొద్దిరోజుల్లోనే ఎముకలు బలోపేతం కావడం గమనించవచ్చు.


ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు పెరిగేందుకు అవసరమైన న్యూట్రియంట్లు ఖర్జూరంలో పెద్దమోతాదులో ఉంటాయి. మరీ ముఖ్యంగా విటమిన్ ఇ లోపమున్నా ఖర్జూరంతో తొలగిపోతుంది. ఫలితంగా ముఖంపై నిగారింపు వస్తుంది. అంటే ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఖర్జూరం తీసుకుంటే కేశాలు నిగనిగలాడటం, ఆరోగ్యంగా ఉండటంతో పాటు ముఖానికి వర్ఛస్సు పెరుగుతుంది.


ఖర్జూరం తీపిగా ఉన్నా డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు మంచిదే ఎందుకంటే ఇందులో ఉండేది నేచురల్ షుగర్. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఖర్జూరం హాని కల్గించదు. ఖర్జూరం తినడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పాదకత పెరుగుతుంది. 


ఇక చాలామంది బరువు తగ్గించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఖర్జూరం బరువు తగ్గేందుకు అద్భుతంగా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు. ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమౌతుంది. మలబద్ధకం వంటి సమస్యలుంటే దూరమౌతాయి. క్రమంగా బరువు తగ్గుతుంది. ఇక అన్నింటికంటే మించింది జీవక్రియ లేదా మెటబోలిజంను వృద్ధి చేయడం. ఎందుకంటే మనిషి ఆరోగ్యం అనేది ఎప్పుడూ శరీరం మెటబోలిజంపై ఆధారపడి ఉంటుంది. రోజూ క్రమం తప్పకుండా ఖర్జూరం తినడం అలవాటు చేసుకుంటే మెటబోలిజం వేగవంతమౌతుంది. దాంతోపాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా మగవారికి లైంగిక విషయాల్లో సామర్ధ్యం పెరుగుతుంది. 


Also read: Skipping Dinner: రాత్రి వేళ డిన్నర్ ఎందుకు మానకూడదు, ఎంత ప్రమాదకరమంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook