Summer Workout Tips 2023: వేసవి కాలం వర్కవుట్స్ లో ఈ తప్పులు చేయకండి!
Summer Workout Tips: వర్కవుట్స్ చేసేవారికి ముఖ్య సూచన ఇది. ఎందుకంటే ఇది వేసవికాలం. వేసవిలో వర్కవుట్స్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేకపోతే అనారోగ్య బారిన పడే ప్రమాదముంది. ఆ వివరాలు మీ కోసం..
Summer Workout Tips 2023: వేసవి వచ్చేసింది.. చలికాలంతో పోలిస్తే వేసవిలో ఫిట్‌గా ఉండటం సులభమే. కానీ ఎండ తీవ్రత పెరిగే కొద్దీ వర్కవుట్స్ చేయడం కష్టమౌతుంటుంది. చెమట కారణంగా ఎక్కువసేపు వర్కవుట్ చేసే పరిస్థితి ఉండదు. అటు తిండి యావ కూడా తగ్గిపోతుంది. ఫలితంగా శరీరానికి కావల్సిన శక్తి తగ్గిపోతుంది. వర్కవుట్‌పై ప్రభావం చూపించే కారణాలు ఇంకా చాలానే ఉన్నాయి.
ఎండకాలంలో వర్కవుట్స్‌లో గుర్తుంచుకోవల్సిన అంశాలు
1. ముందుగా వేసవిలో వర్కవుట్ సమయాన్ని మార్చుకోవాలి. అంటే ఎండ తీవ్రత పెరుగుతున్నప్పుడు వర్కవుట్స్ చేయడం మంచిది కాదు. ఉదయం లేవగానే 7-8 గంటల్లోపే వర్కవుట్స్ పూర్తి చేయడం ఆరోగ్యానికి మంచిది.
2. వేసవిలో వ్యాయామం చేసేటప్పుడు సహజంగానే చెమట ఎక్కువగా పడుతుంది. ఫలితంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అందుకే సాధ్యమైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. కానీ వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువగా నీళ్లు తాగకూడదు. ఉదయం లేవగానే 2 గ్లాసుల గోరు వెచ్చని లేదా సాధారణ నీళ్లు తాగాలి. నీళ్లలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే ఇంకా మంచిది. దీనివల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. వ్యాయామానికి, నీరు తాగడానికి మధ్య 30-40 నిమిషాలు విరామం అవసరం.
3. వర్కవుట్స్ చేసిన వెంటనే స్నానం చేయడం మంచి అలవాటు కాదు. వేసవిలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల చాలామంది వ్యాయామం ముగించిన వెంటనే స్నానం చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల అనారోగ్యం తలెత్తుతుంది. వర్కవుట్స్ తరువాత కాస్సేపు విశ్రాంతి తీసుకోవాలి. దాంతో శరీరం ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు స్నానం చేయడం మంచిది.
4. చాలామంది వ్యాయామం చేశాక అలసట దూరం చేసేందుకు ఎనర్జీ, సామర్ధ్యం కోసం ఎనర్జీ డ్రింక్స్ సేవిస్తుంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే గ్లూకోజ్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
Also Read: Hemoglobin: మీ డైట్‌లో ఈ పదార్ధాలు చేర్చుకుంటే హిమోగ్లోబిన్ లోపం ఇట్టే దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook