ఆయుర్వేద నిపుణులు చెప్పే సూచనల ప్రకారం పాలు, నీళ్లు తాగే విషయంలో ప్రధాన అంతరముంది. నీళ్లు నిలబడి తాగకూడదని..అదే సమయంలో పాలు మాత్రం నిలబడే తాగాలని అంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయుర్వేదంలో ఆహారపు అలవాట్లు విషయంలో చాలా సూచనలున్నాయి. ఇవి పాటిస్తే ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కొంతమందికి పాలు తాగిన తరువాత కడుపులో గ్యాస్ ఏర్పడుతుంటుంది. మరి కొంతమందికి కడుపు ఉబ్బినట్టుగా ఉంటుంది. దీనికి కారణం తిండి తినే విధానం సరైంది కాకపోవడమే. ఎందుకంటే ఆయుర్వేద నిపుణుల ప్రకారం పాలు ఎప్పుడూ నిలబడే తాగాలి, నీళ్లు ఎప్పుడూ కూర్చునే తాగాల్సి ఉంటుంది. 


నీళ్లు ఎందుకు కూర్చుని తాగాలి


ఎవరైనా సరే నీళ్లు ఎప్పుడూ కూర్చునే తాగాలి. ఎందుకంటే కూర్చుని నీళ్లు తాగడం వల్ల రక్తంలో ప్రమాదకర కెమికల్స్ కరగకుండా ఉంటాయి. దాంతో రక్తం శుభ్రంగా ఉంటుంది. దాంతోపాటు తిన్న తరువాత వెంటనే నీళ్లు తాగకూడదు. ఒకేసారి ఎక్కువ నీళ్లు కూడా తాగకూడదు. కొద్దికొద్దిగా తాగితే చాలా మంచిది.


పాలు ఎందుకు నిలబడి తాగాలి


పాలు తాగిన తరువాత చాలామందిలో జీర్ణం సరిగ్గా ఉండదు. జీర్ణం కాకపోవడంతో పాలు తాగిన తరువాత గ్యాస్ సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం రోజూ నిలబడి పాలు తాగాలి. భోజనం చేసిన 2 గంటల తరువాత పాలు గోరువెచ్చగా వేడి చేసుకుని తాగాలి. దీనివల్ల మీ మోకాళ్లు బాగవుతాయి. కండరాలకు ప్రయోజనకరం. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బ్లెడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. 


Also read: Dates Benefits: ఖర్జూరంతో స్థూలకాయానికి 4 వారాల్లో ఇలా చెక్ చెప్పవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook