ఎడారి పండుగా పిల్చుకునే ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ జాతికి చెందింది. అరేబియా సాంప్రదాయం ప్రకారం మరణానికి తప్ప అన్ని సమస్యలకు పరిష్కారం ఖర్జూరంగా చెబుతారు. అలాంటి ఖర్జూరంతో అధిక బరువు సమస్యకు సైతం చెక్ పెట్టవచ్చు.
ఆధునిక జీవనశైలిలో ప్రధాన అవరోధంగా మారుతున్న స్థూలకాయం సమస్యకు చెక్ పెట్టేందుకు ఖర్జూరం అద్భుతంగా పనిచేస్తుంది. అయితే నిర్ణీత సమయంలో నిర్ణీత మోతాదులో తీసుకోవల్సి ఉంటుంది. అధిక బరువు సమస్య నుంచి విముక్తి పొందేందుకు ఖర్జూరం మంచి డైట్‌గా ఉపయోగపడుతుంది.
ఖర్జూరం అనేది హై ప్రోటీన్ పదార్ధం. హై ప్రోటీన్ అనేటప్పటికి బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. కానీ ఖర్జూరం రోజూ తీసుకుంటే..బరువు వేగంగా తగ్గుతారు. అయితే ప్రతిరోజూ ఉదయం పూట ఖర్జూరం తినడం మంచిది. ఉదయం వేళ పరగడుపున ఖర్జూరం తినడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. కేలరీలు నియంత్రించుకోవచ్చు. రాత్రి వేళ ఖర్జూరం తింటే జీర్ణక్రియలో సమస్యలు రావచ్చు. అందుకే ఎప్పుడూ ఉదయం పరగడుపున తీసుకోవడమే మంచిది.
ఖర్జూరం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెటబోలిజం మెరుగై..శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. బరువు తగ్గాలంటే ఖర్జూరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం వేళ పరగడుపునే తీసుకోవాలి. రాత్రంతా ఖర్జూరం నీళ్లలో నానబెట్టి ఉదయం తినాలి. రోజుకు అలా 3-4 ఖర్జూరం పళ్లు తినవచ్చు.
Also read: Sweet Potatoes With Milk: కంద గడ్డలను ఇలా తింటే ప్రమాదకరమా.. ఎందుకు ఇలా తినకూడదో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook