Why Oversleeping Is Bad For Your Health:  మనం మంచి ఆరోగ్యంతో ఉండాలంటే రోజూ రోజూ 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తూంటారు. అయితే కొంత మందికి సరిగ్గా నిద్రపట్టదు, మరికొంత మందికి ఎక్కువ సేపు నిద్రపోతారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. కొందరు నిద్రలోకి జారుకుంటే ఎంత లేపినా లేవరు. ఇలా కుంభకర్ణుడిలా నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. దీని వల్ల కలిగే నష్టాలేంటో ఓసారి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎక్కువ నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు
1. గుండె జబ్బు
రోజూ 8 గంటలు మించి మీరు నిద్రపోతే మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇది కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.
2. తలనొప్పి
మీకు అతిగా నిద్రపోయే అలవాటు ఉంటే తలనొప్పి పెరుగుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ అలవాటును మార్చుకోండి
3. డిప్రెషన్
తక్కువ నిద్రపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతారు, కానీ ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. నిద్రను అదుపు చేసుకోలేని వ్యక్తులు తరచుగా డిప్రెషన్‌కు గురవుతారు.
4. ఊబకాయం
మీరు ఎక్కువ సమయం నిద్రపోతే మీకు పొట్ట వస్తుంది. అంతేకాకుండా మీ నడుము కొవ్వును పెంచుతుంది. ఇది మధుమేహం మరియు రక్తపోటుకు దారి తీయవచ్చు. 


Also Read: Coriander Leaf: కొత్తిమీరతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలరు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook