Coriander Leaf: కొత్తిమీరతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలరు..

Coriander Leaf: కొత్తమీరను తెలుగువారు దాదాపు ప్రతికూరలోనూ వేస్తారు. దీనిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2023, 04:35 PM IST
Coriander Leaf: కొత్తిమీరతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలరు..

Coriander Leaf benefits: కూరల్లో కొత్తమీర వేయడం వల్ల దాని రుచి అద్భుతంగా ఉంటుంది. కొత్తమీరను వివిధ రకాలుగా వాడతారు. కొందరు కర్రీస్ తయారుచేయడంలో ఉపయోగిస్తే.. మరికొందరు దానితో పచ్చడి పెట్టుకుని తింటారు. ధనియాల గింజలను భూమిలో పాతిపెడితే కొత్తమీర మెలుస్తుంది. కొత్తిమీరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా దీనిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. కొత్తిమీరను వంటకాల్లోనే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కొత్తమీర తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 

కొత్తమీరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్లుతోపాటు కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం మరియు మెగ్నీషియం వంటి  మూలకాలు ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంతో పాటు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

కొత్తిమీర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. కాలేయ వ్యాధులకు చెక్
కాలేయ సంబంధిత సమస్యలకు కొత్తిమీర చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  కొత్తిమీర ఆకులలో తగినంత ఆల్కలాయిడ్స్ మరియు ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి పిత్త రుగ్మతలు మరియు కామెర్లు వంటి కాలేయ వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి.
2. ప్రేగు సంబంధిత వ్యాధులు దూరం
కొత్తిమీర తినడం వల్ల జీర్ణవ్యవస్థలో ఆటంకాలు మరియు ప్రేగు సంబంధిత వ్యాధుల నుండి ప్రజలు ఉపశమనం పొందుతారు. 
3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్యులార్ డ్యామేజ్ ను నివారిస్తాయి. కొత్తిమీరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

4. గుండె జబ్బులు దూరం
కొత్తిమీర తీసుకోవడం వల్ల శరీరంలోని అనవసరమైన సోడియం మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఇది చెడు కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
5. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది
ఆహారంలో కొత్తిమీరను ఉపయోగించడం వల్ల రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. 

Also Read: Mushrooms Benefits: పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. అవేంటో తెలిస్తే ఇప్పుడే తినడం మెుదలుపెడతారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News