Poha Side Effects: పోహా.. మనం తెలుగు రాష్ట్రాల్లో అటుకులు అని పిలుస్తారు. నార్త్ లో మాత్రం దీనిని పోహా అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది దీనిని బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తీసుకుంటారు. పోహాతో చాలా వెరైటీ వంటకాలు చేసుకోవచ్చు. రైస్ కంటే ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. పోహాలో పైబర్ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల మీ ప్రేగులు క్లీన్ చేయబడతాయి. ఐరన్ లోపం ఉన్నవారు పోహాను తినడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో సమృద్ధిగా ఐరన్ లభిస్తుంది. దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోహా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు
** చాలా మంది బరువు తగ్గడానికి పోహా తింటారు. అయితే రోజూ దీనిని తినడం వల్ల బరువు పెరగడంతోపాటు ఊబకాయం బారిన పడతారు. అందుకే రోజూ పోహా తినడం మానుకోండి.
**మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్నానికి దూరంగా ఉండండి. ఎందుకంటే అన్నం తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. పోహా కూడా బియ్యంతో తయారు చేస్తారు. కాబట్టి దీనిని తినడం వల్ల కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. 
**అల్పాహారంలో పోహా తినడం వల్ల చాలా మంది ఎసిడిటీ సమస్య వస్తుంది. అందుకే ఉదర సంబంధిత వ్యాధులు ఉన్నవారు పోహా తినడం మానుకోండి. ఎందుకంటే పోహా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. 
**పోహా తినడం వల్ల పంటి సమస్య తలెత్తవచ్చు. పోహా పచ్చిగా ఉంటుంది, దీని వల్ల పంటి సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. 
**పోహా తిన్న తర్వాత మీకు వాంతులు అయ్యే అవకాశం ఉంది.  అందుకే ఉదయం అల్పాహారంలో పోహాను తినడం మానుకోండి. 


Also Read: Eggs: ఇలా ఇతర ఆహారాలతో కలిపి గుడ్లు తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు.!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి