Side Effects of Turmeric: ఈ సమస్యలు ఉన్నవారు పసుపు అస్సలు తినకూడదు..!
Side Effects of Turmeric: మన తెలుగువారు ప్రతి కూరలోనూ దాదాపు పసుపును వినియోగిస్తారు. దీనిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొందరు మాత్రం ఈ పసుపు తినడం వల్ల జబ్బులు బారిన పడే అవకాశం ఉంది.
Turmeric Side Effects: వంటకాల్లో ఉపయోగించే వాటిల్లో పసుపు కూడా ఒకటి. ఇది కూరకు రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని మన పూర్వీకులు ఎన్నో ఏళ్లు నుంచి దీనిని వాడతున్నారు. పసుపులో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీఫంగల్ వంటి అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పసుపును తినకూడదు, తింటే వారి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఏ వ్యాధులు ఉన్నవారో తెలుసుకుందాం.
1. మధుమేహంతో భాదపడుతున్నవారు
మధుమేహంతో బాధపడుతున్న వారు పసుపును అస్సలు తినకూడదు. వీరు పసుపును ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
2. కామెర్లు రోగులు
కామెర్లు ఉన్నవారు వీలైనంత వరకు పసుపు తినకపోవడం మంచిది. ఒకే వేళ తిన్నట్లయితే మీ ఆరోగ్యం క్షీణించి.. సీరం బిలిరుబిన్ స్థాయిలు పెరుగుతాయి.
3. స్టోన్స్ వ్యాధిగ్రస్తులు
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు వీలైనంత వరకు పసుపు వాడకం తగ్గించండి, లేకపోతే మీ సమస్య మరింత ముదిరే అవకాశం ఉంది.
4. రక్తస్రావం రోగులు
శరీరంలోని ఏదైనా భాగం నుండి రక్తం కారుతున్న వారు పసుపు తీసుకోవడం తగ్గించాలి, లేకపోతే రక్తస్రావం పెరుగుతుంది. దీని వల్ల మీరు రక్తహీనత బారిన పడే అవకాశం ఉంది.
Also Read: Immunity Booster: రోగ నిరోధక శక్తి లోపం వల్ల ఈ వ్యాధులు వస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి!
Also Read: Joint Pain: కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook