Treatment Joint Pain: శరీరంలో యూరిక్ ఆసిడ్ పరిమాణాలు విచ్చలవిడిగా పెరగడం కారణంగా కీళ్లనొప్పుల సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా దీని కారణంగా కొంతమందిలో గుండె సమస్యలతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో నిల్వగా ఉండే ప్యూరిన్ ఉత్పత్తి.. అయితే వీటిని ఊపిరితిత్తులు సరిగా ఫిల్టర్ చేయలేకపోవడం కారణంగా యూరిక్ యాసిడ్ శరీరంలోని కొన్ని భాగాల్లో ఎక్కడపడితే అక్కడ స్పటికం లాగా పేరుకుపోతోంది.
దీని కారణంగా యూరిక్ యాసిడ్ మూత్రం నుంచి బయటికి రాకపోవడంతో కీళ్లు మోకాళ్ళ భాగాల్లో స్పటికంలా తయారవుతోంది. దీంతో చాలామందిలో కీళ్లలో వాపులతో పాటు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే గుండె సమస్యలకు దారి తీసే ఛాన్స్ కూడా ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యూరిక్ యాసిడ్ సమస్యలు పోవడానికి ప్రతిరోజు ఆహారంలో పండ్లను తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫ్రక్టోజ్ తక్కువ పరిమాణంలో ఉన్న పండ్లను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఏయే పండ్లను తీసుకోవడం వల్ల సులభంగా ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి
చింతపండు గుజ్జు:
చింతపండు గుజ్జుతో తయారుచేసిన ఆహారాలను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన యూరికి యాసిడ్ను సులభంగా నియంత్రించవచ్చు. 100 గ్రాముల చింతపండు గుజ్జులో 12 గ్రాముల వరకు ఫ్రక్టోజ్ ఉంటుంది. కాబట్టి దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల సులభంగా కీళ్ల నొప్పులు దూరమవుతాయి.
యాపిల్ పండ్లు:
యాపిల్ పండ్లు కూడా యూరిక్ యాసిడ్ నియంత్రించేందుకు ప్రభావంతంగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు కీళ్ల నొప్పులను కూడా దూరం చేస్తాయి. వంద గ్రాముల యాపిల్ పండులో 9 గ్రాముల ఫ్రక్టోజ్ ఉంటుంది. దీంతో సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యలు నయమవుతాయి.
Also Read: Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook