Kidney Health Tips:  మన శరీరంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేయడంలో కిడ్నీలు అద్భుతంగా పనిచేస్తాయి. మూత్రాన్ని ఉత్పత్తి చేయడంలోనూ, బీపీని అదుపు చేయడంలోనూ మూత్రపిండాలు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. కిడ్నీలు హెల్తీగా ఉండటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మూత్రపిండాలు పాడైతే ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్షణాలు: కిడ్నీ పనితీరులో సమస్య ఉంటే నిద్రలేమి, యూరిన్ రంగులో తేడా, ముఖం, కాళ్లలో వాపు, శ్వాసలో ఇబ్బందులు తలెత్తుతాయి. 


కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే పుడ్: 
1. తిప్పతీగ ఆల్కలాయిడ్స్, టాక్సిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఫ్రీ-రాడికల్స్ ను తొలగించడంతోపాటు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. 
2. పసుపు ప్లాస్మా ప్రొటీన్‌ కలిగి ఉంటుంది. ఇది క్రియాటినిన్ స్థాయిలు మరియు సీరం యూరియాను తగ్గిస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
3. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్‌ఫ్లమేషన్‌తో పాటు ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చే కిడ్నీ నొప్పిని కూడా తగ్గిస్తాయి.
4. కరక్కాయ, ఉసిరికాయ మరియు తానికాయ మూత్రపిండాల కణజాలాన్ని బలపరుస్తుంది. ప్లాస్మా ప్రోటీన్, అల్బుమిన్, క్రియేటినిన్‌ను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.
5. మూత్రంలోని వ్యర్థాలను తొలగించడంలో కిడ్నీలు సహాయపడతాయి.


Also read: Butter Milk Benefits: మజ్జిగతో మరచిపోలేని ప్రయోజనాలు.. ఎప్పుడు తాగాలో తెలుసుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి