Healthy Hair Care Tips: హెయిర్ ఫాల్‌ సమస్య విపరీతంగా పెరుగుతుంది. దీంతో అనేక చర్యలు తీసుకుంటారు కానీ అన్ని పాజిటివ్ ఫలితాలు ఇవ్వవు. అయితే చర్మం జుట్టు ఆరోగ్యానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా వా సమస్యను అధిగమించవచ్చు. మార్కెట్లో దొరికే వస్తువులతో కెమికల్ అధికంగా ఉండటం వల్ల హెయిర్ ఫాల్ సమస్య మరింత పెరుగుతుంది. అయితే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు సహజ సిద్ధంగా మన జుట్టుకు మెరుపును  అందిస్తాయి.
దీనివల్ల చుట్టూ ఆరోగ్యంగా పెరుగుతుంది. మెరుస్తూ కనిపిస్తుంది  జుట్టు చివర్ల వరకు చిట్లి పోకుండా ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుడ్లు..
జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి గుడ్లు కీలకపాత్ర పోషిస్తాయి. జుట్టు సమస్యలకు గుడ్లు ఎంతో మంచివి. గుడ్లలో ముఖ్యంగా ఖనిజాలు  బయోటిన్, పోలేట్‌ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి జుట్టు సమస్యలు రాకుండా రిపేర్ చేసి మంచి పోషణను అందిస్తాయి. గుడ్లను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టుకు ఆరోగ్యం అంతేకాదు గుడ్డులోనే తెల్ల సోనను జుట్టుకు అప్లై చేయడం వల్ల నాచురల్ గా మెరుస్తుంది. ఇంట్లో పెరుగు, గుడ్డు, తేనె కలిపి హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టు సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు.


ఉల్లిపాయ రసం..
జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇది పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. ఉల్లిపాయ జుట్టు స్ప్లిట్‌ కాకుండా కాపాడుతుంది. డాండ్రఫ్ ను నివారిస్తుంది కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్ ఉండటం వల్ల ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది . దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఉల్లిపాయ రసం జుట్టుకు అదనంగా మెరుపును అందిస్తుంది. ఇది ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే వస్తువు.


ఇదీ చదవండి:  రేపు దేశవ్యాప్తంగా అంబరాన్నంటనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 4000 మంది ప్రత్యేక అతిథులు


కలబంద..
కలబంద కూడా అందరి ఇళ్లలో సులభంగా పెంచుకుంటారు. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కలబంద జుట్టు సమస్యలకు ఎఫెక్ట్ జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. జుట్టును బలంగా మారుస్తుంది, కలబంద జెల్ ని మాస్కు రూపంలో వేసుకోవడం వల్ల ఎంతో మంచిది మీ హెయిర్ కేర్ రొటీన్ లో కలబంద ఉండేలా చూసుకోండి.


కొబ్బరి నూనె..
కొబ్బరి నూనెలో మాయిశ్చర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రోటీన్ లేమిని భర్తీ చేస్తుంది. కొబ్బరి నూనె జుట్టు ఆరోగ్యంగా బలంగా మారుస్తుంది. వీటిని జుట్టుకు నేరుగా అప్లై చేసి ఆ తర్వాత హెయిర్ వాష్‌ చేసుకోవాలి. నిమ్మరసం కొబ్బరి నూనె కలిపి జుట్టుకు మసాజ్ చేయడం వల్ల అదనపు ఫలితాలు కలుగుతాయి.


కరివేపాకు..
మన ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండే కరివేపాకులో కూడా జుట్టుకు మంచి పోషకాలు అందిస్తాయి. కరివేపాకు వల్ల జుట్టు తెల్లబడే సమస్య కూడా రాదు ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ బి ,విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టుకు కుదుళ్ల నుంచి ఆరోగ్యం అంతం చేస్తాయి హెయిర్ ఫాలికల్స్ బలంగా మారేలా ప్రోత్సహిస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 


ఇదీ చదవండి: రేపు భారత్‌తోపాటు ఈ 5 దేశాలకు కూడా ఇండిపెన్‌డెన్స్‌ డే.. ఆ దేశాలు ఏవో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter