Breakfast Ideas: ఈ బ్రేక్ ఫాస్ట్ ఫాలో అయితే చాలు.. బరువు తగ్గడం సూపర్ ఈజీ
Weightloss Tips: బరువుతగ్గాలి అనుకునే వాళ్ళు.. ముఖ్యంగా చూసుకోవాల్సింది ఆహారపు అలవాట్ల గురించి. ఉదయం మనం తినే బ్రేక్ ఫాస్ట్ కూడా మన బరువుని ప్రభావితం చేస్తుంది. అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో.. తినకూడని ఆహార పదార్థాలు ఏంటి తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి ..అని తెలుసుకోవాలి.
Breakfast for Weight Loss: ఈమధ్య ఉబకాయం చాలా కామన్ ప్రాబ్లం.. అయిపోయింది. దాదాపు ప్రతి ఒక్కరూ బరువు తగ్గడానికి విశ్వ ప్రయత్నాలు.. చేస్తూ ఉంటారు. ఈమధ్య కాలంలో మన ఆహారపు అలవాట్ల కారణంగానే ఈ సమస్య పెరిగిపోతోంది. అందుకే బరువుతగ్గాలి అంటే ముందుగా ఆలోచించాల్సింది మనం తినాల్సిన ఆహారం గురించి.
ఉదయం మనం తినే ఆహారం రోజు మొత్తం మన శరీరంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఉదయం మనం తినే బ్రేక్ ఫాస్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవాళ్లు.. ఉదయాన్నే కచ్చితంగా తినాల్సిన కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల.. ఆకలి పెరుగుతుంది. అలాకాకుండా మనకి శక్తిని ఇస్తూ ఆకలి కూడా నియంత్రించే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
బరువు తగ్గడానికి బ్రేక్ ఫాస్ట్ లో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది అని చూద్దాం..
కోడిగుడ్డు:
ఉదయాన్నే కోడిగుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. బ్రేక్ ఫాస్ట్ లో కోడిగుడ్డు తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ అందుతాయి. గుడ్డు చాలాసేపు మన ఆకలి నియంత్రిస్తుంది. కాబట్టి బరువు కూడా త్వరగా తగ్గిపోవచ్చు. ఉదయాన్నే కోడిగుడ్డు తినడం వల్ల ..శరీరానికి కావాల్సిన పోషకాలు అందడం మాత్రమే కాక బరువు కూడా త్వరగా తగ్గిపోవచ్చు.
అరటిపండు:
ఉదయాన్నే అరటిపండు బ్రేక్ ఫాస్ట్ లాగా తినడం వల్ల చాలానే ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా అరటి పండులో ఉండే ఫైబర్ కంటెంట్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా అరటిపండులో.. మన శరీరానికి కావాల్సిన క్యాలరీలు కూడా ఉంటాయి. అవి మనకి కావాల్సిన శక్తిని ఇవ్వడంతో పాటు బరువు కూడా తగ్గడానికి ఉపయోగపడతాయి.
పెరుగు:
ఉదయాన్నే పెరుగు అన్నం తినడం చాలా మంచిది అమ్మమ్మల కాలం నుంచి అందరూ చెబుతున్న మాటే. పెరుగులో ఉండే ప్రోబయోటిక్ మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ కూడా పెరుగులో పుష్కలంగా లభిస్తుంది. పెరుగు తినడం వల్ల సేపు ఆకలి కూడా వేయదు.
బెర్రీలు:
త్వరగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు బెర్రీ పండ్లను ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. అందులో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందులో లభిస్తాయి. మన రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు బరువు తగ్గడానికి కూడా బెర్రీలు ఉపయోగపడతాయి.
ద్రాక్ష:
ద్రాక్షపళ్లలో చాలా వరకు నీటి శాతం ఉంటుంది. ద్రాక్ష పళ్ళు తినడం వల్ల ఆకలి కూడా నియంత్రణలోకి వస్తుంది. ఈ రకంగా త్వరగా బరువు తగ్గొచ్చు.
ఇకపై బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో వీటిని తీసుకుని ట్రై చేయండి. కచ్చితంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి.
Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..
Read more: Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter