Selfie Tragedy video goes viral on mexico: సెల్పీల మోజులో పడి కొందరు తమ జీవితాలను రిస్క్ లో పడేసుకుంటున్నారు. కొందరు సెల్ఫీలకు అడిక్ట్ అవుతున్నారు. ఇలాంటి క్రమంలో.. వారు ఎక్కడికి వెళ్లిన కూడా ఫోటోలు దిగుతూ లేని ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. రన్నింగ్ బస్సుల్లో, జంతువుల దగ్గర ఫోటోలు దిగుతూ ఎందరో రిస్క్ లో పడిన ఘటనలు వార్తలలో నిలిచాయి. మరికొందరు జలపాతాలు, సముద్రాలలో ఫోటోల కోసం ప్రయత్నించి, విషాదకర సంఘటనల్లో చిక్కుకున్న ఘటనలు కొకొల్లలు.
MEXICO - In Hidalgo, a famous train that comes from Canada and travels all the way to Mexico City, attracting locals, struck a woman who was trying to take a selfie as the train approached. She passed at the scene. Article in comments. pic.twitter.com/32XdsCehEB
— The Many Faces of Death (@ManyFaces_Death) June 5, 2024
ఇలాంటి క్రమంలో సెల్ఫీల మోజులో తమ జీవితంలో అంధకారంను నింపుకున్నారు. కొందరు ఏపనిచేసిన కూడా ఫోటోలు దిగుతుంటారు. తమ ప్రతి యాక్టివీటీ, అప్ డేట్ కూడా ఫోటోలు దిగి సోషల్ మీడియాల్లో పోస్టులు చేస్తుంటారు. కొన్నిసార్లు ఇది ఒక పరిధిదాటనంతవరకు బాగానే ఉన్నా.. కొన్నిసార్లు మాత్రం లేని ఇబ్బందులు కల్గచేసేదిగా మారుతుంది. ఈకోవకు చెందిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
మెక్సికోలో జరిగిన ఈ విషాదకర ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిడాల్గో సమీపంలో ఆవిరి ఇంజిన్ తో ట్రైన్ నడుస్తోంది. కొంత మంది యువత అక్కడికి వెళ్లారు. ఆవిరి ఇంజిన్ ముందు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. కొంత మంది దూరంతో ఫోటోలు దిగుతుండగా.. మరికొందరు మాత్రం దగ్గరికి వెళ్లి ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తిచూపించారు. ఈనేపథ్యంలో.. ఒక యువతి మరీ అత్యుత్సాహాంగా ప్రవర్తించింది. దీంతో రెప్పపాటులో ఊహించని ఘటన ఎదురైంది. యువతి.. స్పీడ్ గా వస్తున్న ఆవిరి ట్రైన్ ముందుకు వెళ్లి నిలబడింది.
అంతేకాకుండా.. రివర్స్ లో ట్రైన్ ముందు సెల్పీ దిగడానికి ప్రయత్నించింది. కానీ ఆమె రైలు పట్టాల దగ్గరలో ఉన్న విషయంను మర్చిపోయింది. అప్పుడు స్పీడ్ గా వచ్చిన రైలు ఆమె తనను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె దూరంగా కుప్పకూలీ పడిపోయింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు.
Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..
యువతి మాత్రం ఘటన స్థలంలోనే చనిపోయినట్లు తెలుస్తోంది. కెనడియన్ పసిఫిక్ కాన్సాస్ సిటీ విభాగం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రైలు వచ్చే ముందకు ట్రాక్ లపై కనీసం 10 మీటర్ల దూరంలో ఉండాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter