Hair Fall: జుట్టు విపరీతంగా రాలిపోతోందా.. ఈ మ్యాజిక్ జ్యూస్ తాగాల్సిందే..
Hair Care Juice : జుట్టు రాలిపోవడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. కానీ దాని కోసం చాలామంది ఎన్నో రకాల టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. కానీ ఎప్పుడూ ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఒక మ్యాజిక్ జ్యూస్ చేసుకుని తాగితే జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. అసలు ఆ మ్యాజిక్ జ్యూస్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
Hair Fall Remedies: వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఎదుర్కునే సమస్య జుట్టు రాలిపోవడం. ఈ మధ్య కాలంలో ఇది ఒక కామన్ ప్రాబ్లమ్‌గా మారిపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, మన లైఫ్ స్టైల్ వల్ల ఈ ప్రాబ్లం చాలా మందికి వస్తుంది. జుట్టు ఊడిపోవడం ఆగాలి అంటే ముందు కుదుల్లో బలంగా మారాలి.
జుట్టు కోసం కొందరు విటమిన్ టాబ్లెట్లు కూడా వాడతారు. కానీ ప్రతి చిన్న దానికి మెడిసిన్ వాడడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందుకే మెడిసిన్ కి బదులుగా కొన్ని నేచురల్ డ్రింక్స్ తో హెయిర్ ఫాల్ ను తగ్గించుకోవచ్చు.
క్యారెట్, పాలకూర కలిపి జ్యూస్ చేసి కుదుళ్లకు రాయడం వల్ల జుట్టు రాలడం ఒక వారంలోనే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్, పాలకూర లో ఉండే పోషకాలు కుదుళ్లను బలంగా మారుస్తాయి. ఇది ఒక మ్యాజికల్ జ్యూస్ అని చెప్పచ్చు. దీనిని చాలా సులువుగా చేసుకోవచ్చు కూడా.
ముందుగా సగం క్యారెట్ ముక్క ను తీసుకుని తురుముకోవాలి. తరువాత ఒక గుప్పెడు పాలకూర ఆకులు తీసుకోవాలి. ఏడెనిమిది కరివేపాకులు, ఒక సెలెరీ కొమ్మ, అర ముక్క ఉసిరి, సగం దోసకాయ ముక్కలు, చిన్న అల్లం ముక్క, సగం యాపిల్, గుప్పెడు మునగ ఆకులు తీసుకోవాలి.
అన్నిటిని మిక్సీ పట్టి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. దాంట్లో కొంచెం మంచి నీళ్లు కలుపుకుంటే అది జ్యూస్ లాగా మారుతుంది. దాన్ని ఒక గ్లాస్ లోకి తీసుకొని నచ్చితే కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని తాగొచ్చు. ఇది ఒక సూపర్ డ్రింక్. ఈ డ్రింక్ రోజు తాగితే వారం రోజుల్లోనే జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది.
క్యారెట్ పాలకూర జ్యూస్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అది కుదుళ్ళను బలపరచడానికి ఉపయోగపడుతుంది. జుట్టు రాలడానికి కూడా తగ్గిస్తుంది. క్యారెట్ లో బీటా కెరోటిన్ కూడా జుట్టుకి చాలా మంచిది. కరివేపాకు వల్ల జుట్టు పెరుగుతుంది.
ఉసిరి లో ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు బలంగా మారేలా చేస్తుంది. ఇక అల్లం వల్ల రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. దోసకాయ లో వాటర్ కంటెంట్ ఎక్కువ కాబట్టి అది హైడ్రేషన్ కు ఉపయోగపడుతుంది. సెలరీ, యాపిల్ హెయిర్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.
మునగాకులో ఎ, బి, ఇ విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ కలిపి చేసే జ్యూస్ ప్రతిరోజూ ఉదయం తాగాలి. ఈ జ్యూస్ చుండ్రు కి కూడా చెక్ పెడుతుంది. ఇలా ఒక వారం తాగినా చాలు మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆరు నెలల్లో జుట్టు బాగా స్ట్రాంగ్ గా మారి అస్సలు ఊడదు.
Read More: Smita Sabharwal: వరల్డ్ బుక్ డే... వైరల్ గా మారిన స్మితా సబర్వాల్ చేసిన లేటెస్ట్ ట్వీట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter