Pandu Mirchi Lemon Chutney: పండు మిరపకాయ, నిమ్మకాయ చట్నీ.. పైనుంచి నెయ్యి వేసుకొని తింటే రుచి వేరే లెవెల్..
Pandu Mirchi Lemon Chutney: చాలామంది నిమ్మకాయ తొక్కు అంటే ఎంతగానో ఇష్టపడి తింటూ ఉంటారు. దీనిని తెలంగాణ స్టైల్ లో తయారు చేసుకోండి తింటే ఆ రుచి వేరే ఉంటుంది. అయితే మీరు కూడా నిమ్మకాయ తొక్కుడు ఇలా ట్రై చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ట్రై చేయండి..
Pandu Mirchi Lemon Chutney: ప్రతి విందు భోజనంలో పచ్చళ్ళు తప్పకుండా ఉండాల్సిందే. ఎందుకంటే చాలామందికి పచ్చళ్ళు లేకుండా నోట్లోకి ముద్ద దిగదు. చాలామంది రోజు ఆహారాలు తినే క్రమంలో తప్పకుండా పచ్చళ్లను కూడా తింటూ ఉంటారు. నిజానికి కొన్ని రకాల పచ్చళ్ళు శరీరానికి ఎంతగానో ఆరోగ్యాన్ని అందిస్తాయి. కరివేపాకు పచ్చడి, మెంతి, కొత్తిమీర, పుదీనా ఆకు పచ్చళ్ళు శరీరానికి అనేక రకాలుగా సహాయపడతాయి. వీటిల్లో ఉండే గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి. అయితే చాలామంది నిమ్మకాయ పచ్చడి కూడా ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. నిమ్మకాయ పచ్చడి లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఆహారాలు తీసుకునే క్రమంలో ఈ పచ్చడిని తీసుకుంటే మంచి ఆరోగ్య ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు విటమిన్ సి లోపం నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అయితే చాలామంది దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయని, బయట మార్కెట్లో లభించే పచ్చళ్ళు ఎక్కువగా కొనుక్కొని తింటూ ఉంటున్నారు. బయట లభించే వాటికంటే ఇంట్లోనే ఇలా సులభంగా నిమ్మకాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు.
నిమ్మకాయ పచ్చడి తయారీ విధానం:
నిమ్మకాయలు - 1 కిలో (బీజాలు తీసేయాలి)
ఎండు మిరపకాయలు - 100 గ్రాములు
ఆవాలు - 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - ఒక కట్ట
ఇంగువ - 1 టీస్పూన్
అల్లం - 2 అంత ముక్క
వెల్లుల్లి - 5 రెబ్బలు
ఉప్పు - రుచికి సరిపోతుంది
నూనె - వేయించడానికి సరిపోతుంది
ఆమ్చూర్ పౌడర్ - 1 టేబుల్ స్పూన్ (తగినంత)
తయారీ విధానం:
ముందుగా ఈ నిమ్మకాయ పచ్చడిని తయారు చేసుకోవడానికి నిమ్మకాయలను నీటిలో శుభ్రంగా కడిగి వాటిని ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇలా ఆరబెట్టుకున్న నిమ్మకాయలను వాటిలో నుంచి విత్తనాలను తీసి రసాన్ని ఒక బౌల్లో పిండుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఎండుమిరపకాయలను తీసుకొని నీళ్లలో నానబెట్టి వాటిని బాగా ఆరనివ్వాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో కావలసినంత నూనె వేసుకొని బాగా వేడి చేసుకోండి. ఇలా వేడి చేసుకున్న తర్వాత అందులోనే నానబెట్టుకున్న ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి.
ఆ తర్వాత ఇందులోనే నిమ్మకాయ పులుసు వేసుకొని ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత తగినంత ఉప్పు, ఆమ్చూర్ పౌడర్ వేసుకొని బాగా ఉడకనివ్వండి.
ఇలా తయారు చేసుకున్న మిరపకాయ నిమ్మకాయ మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకొని చల్లబడ్డ తర్వాత మిక్సీ గ్రైండర్‌లోకి ఎత్తుకొని మిక్సీ పట్టుకోండి.
ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గాజు సీసాలోకి తీసుకొని భద్రపరచుకోండి. అంతే సులభంగా ఎర్ర మిరపకాయ నిమ్మకాయ చట్నీ తయారైనట్లే..
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
చిట్కాలు:
ఈ చట్నీ టెస్ట్ బాగుండాలంటే నిమ్మకాయలు ఎక్కువగా పండుగ ఉండాల్సి ఉంటుంది.
మిరపకాయలను నీటిలో నానబెట్టడం వల్ల చట్నీ టెస్ట్ మరింత పెరుగుతుంది.
ఈ చట్నీలో నూనెని ఎక్కువగా వాడడం వల్ల అద్భుతమైన రుచి లభిస్తుంది.
ఈ పచ్చడిని కేవలం గాజు సీసాలో ఉంచితేనే కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.