Post Covid Symptoms: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన వినాశనం అంతా ఇంతా కాదు. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కూడా వెంటాడుతూనే ఉంది. పోస్ట్ కోవిడ్ లక్షణాల్లో గుండె సమస్య ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి ఎందరినో బలితీసుకుంది. ఇంకొందరిని పోస్ట్ కోవిడ్ లక్షణాలతో వెంటాడింది. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నామనే ఆనందం ఎంతో సేపు నిలవడం లేదు. వివిధ రకాల ఇతర సమస్యలు వేధిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా గుండె సమస్య. పోస్ట్ కోవిడ్‌లో గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య ఎక్కువే కన్పిస్తోంది. యుక్త వయస్సు అంటే 30-40 ఏళ్ల వారిలో కూడా పోస్ట్ కోవిడ్‌లో భాగంగా గుండె సమస్య ప్రధానంగా మారింది. పోస్ట్ కోవిడ్ అనేది పెను సవాలే విసురుతోంది. పోస్ట్ కోవిడ్‌లో భాగంగా గుండె వ్యాధుల కేసులు అధికమౌతున్నాయి.


అందుకే కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కచ్చితంగా గుండె సంబంధిత పరీక్షలు తప్పనిసరి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే గుండె సమస్యలు వస్తున్నాయని తేలింది. పోస్ట్ కోవిడ్‌లో ఆరోగ్యపరంగా పరీక్షలు చేయించుకోవల్సి ఉంటుంది. సరైన పౌషికాహారం, వ్యాయామం, తగిన విశ్రాంతి తప్పనిసరిగా చూసుకోవాలి. కరోనా నుంచి బయటపడిన తరువాత అప్పుడప్పుడూ చెకప్ చేయించుకుంటే..మరణం వరకూ పరిస్థితి వెళ్లదనేది ప్రముఖ హృద్రోగ నిపుణులు చెబుతున్న మాట.


ఇదంతా ఎందుకంటే..కోవిడ్ ప్రధానంగా రెండు అవయవాలపైనే ప్రభావం చూపిస్తుంది. ఊపిరితిత్తులు, గుండెపైనే కోవిడ్ వైరస్ ప్రభావముంటుందని ఇప్పటికే  పలు పరిశోధనల్లో తేలింది. దగ్గు, ఆయాసం తగ్గినంతమాత్రాన బయటపడ్డామని భావించకూడదు. గుండె విషయంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పడం కష్టమేనని వైద్యులు చెబుతున్నారు. కరోనా వైరస్ బారిన పడినవారిలో 40 శాతం మందికి గుండె సంబంధిత వ్యాధులు తలెత్తుతున్నాయి. ఇందులో ప్రధానంగా హార్ట్ పంపింగ్ తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం, లేదా హార్ట్ రేట్ తక్కువగా ఉండటం, హార్ట్ ఎటాక్, పెరాలసిస్ స్ట్రోక్ వంటివి లక్షణాలుగా కన్పిస్తున్నాయి.


Also read: Fenugreek Seeds Benefits: మెంతులతో గుండెపోటు ముప్పు తగ్గించవచ్చు, మెంతులతో కలిగే ప్రయోజనాలివే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook