Herbal Teas For Heart Health: వేసవికాలంలో చాలా మంది వడదెబ్బ బారిన పడుతుంటారు. దీని వల్ల డీహైడ్రేషన్‌, గుండె సమస్యలు తగ్గుతాయి.  అయితే చాలా మంది ఈ సమస్య నుంచి బయట పడడానికి మార్కెట్‌లో లభించే కూల్‌ డ్రింక్స్‌ను, పండ్ల రసాలను తీసుకుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  వీటికి బదులుగా మీరు హర్బల్‌ డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ హర్బల్‌ డ్రింక్స్‌ వల్ల గుండె నాళాలు బ్లాక్‌ కాకుండా సహాయపడుతాయి.  అయితే ఏ హర్బల్‌ డ్రింక్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఇవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లెమన్‌, అల్లం టీ: 


నిమ్మకాయ , అల్లంలో బోలెడు పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా వేసవికాలంలో బ్లడ్‌ ప్రజర్‌ రాకుండా ఈ డ్రింక్‌ సహాయపడుతుంది. ఇందులోని విటమిన్‌ సి గాయాలను త్వరగా నయం చేస్తుంది.  


త్రిఫల టీ: 


త్రిఫల టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని పరిగడపున తీసుకోవాలి. ఇందులో ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమం ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంచుతుంది.  అంతేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది.  శరీరంలో ఉండే కొవ్వును కూడా తగ్గిస్తుంది.  


దాల్చిన చెక్క టీ:  


దాల్చిన చెక్క మనం ప్రతిరోజు వంటకం ఉపయోగించే పదార్థం. దీనితో తయారు చేసిన టీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.  ఒక కప్పు వేడి నీళ్లల్లో దాల్చిన చెక్క కలుపుకొని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది. గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. 


అల్లం టీ:


అల్లంలో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి. దీని పాలతో కలుపుకొని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.  ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  గుండె రక్త నాళాల్లో బ్లాకేజ్‌లను క్లీయర్‌ చేస్తాయి. 


తులసి టీ:


తులసితో తయారు చేసిన ఈ డ్రింక్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గుతాయి. అంతేకాకుండా గుండె నాళాల్లో ఏవైనా బ్లాకేజ్‌లు ఉంటే క్లీయర్‌ చేస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో తులసి టీ ఎంతో మేలు చేస్తుంది. 
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి