Petrol Stations : బండిలో పెట్రోల్ కొట్టించుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Petrol vs Diesel : మీ దగ్గర ఉన్నది పెట్రోల్ తో నడిచే బండేనా? కానీ ప్రతిసారి పెట్రోల్ కోసం బంక్ కి వెళ్ళినప్పుడు వారు వాడుతున్నది ఎలాంటి రకం పెట్రోల్ అని చూస్తున్నారా? అసలు ఎన్ని రకాల ఫ్యూయల్ వారి వద్ద సిద్ధంగా ఉంటాయో తెలుసా? పెట్రోల్ బంక్ లో ఎన్ని రకాల ఫ్యూయల్ ఉంటాయి? వాటి మధ్య బేధాలు ఏంటి అని తెలుసుకుందాం..
Petrol vs Diesel : మీరు పెట్రోల్ బంక్ కి వెళ్ళిన ప్రతిసారి మీ 2 వీలర్ లేదా 4 వీలర్ లో ఏ పెట్రోల్ కొట్టిస్తున్నారు అని చూస్తున్నారా? అసలు పెట్రోల్ బంక్ లో రెండు రకాల ఫ్యూయల్స్ అమ్ముతారని మీకు తెలుసా? కేవలం బంక్ కి వెళ్లి పెట్రోల్ కొట్టమని చెప్పి రీడింగ్ మాత్రమే గమనిస్తున్నారా? కానీ పెట్రోల్ ఇంకా డీజిల్ రెండిటి లో రెండు రకాలు ఉంటాయని, వాటి మధ్య వ్యత్యాసం కూడా ఉంటుంది అని కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు.
పెట్రోల్ బంక్ లో రెండు రకాల ఇంధనాలు ఉంటాయి. వాటి ధర తో పాటు నాణ్యత లో వ్యత్యాసాలు ఉంటాయి. అయితే అన్నీ పెట్రోల్ బంక్ లలో ఇలా రెండు రకాల పెట్రోల్ ఉండదు. కొన్ని సేల్స్ ఎక్కువగా ఉన్న పెద్ద బంక్ లలో మాత్రమే ఇలా రెండు రకాల ఫ్యూల్స్ అమ్ముతారు. పెట్రోల్ లో ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్ 95, డీజిల్ లో ఎక్స్ట్రా గ్రీన్ అని డిఫరెన్స్ ఉంటుంది.
వీటి ధర లో మాత్రమే కాకుండా నాణ్యత లో కూడా చాలా తేడాలు ఉంటాయి. పెట్రోల్ వల్ల బండి పర్ఫామెన్స్ కూడా బాగుంటుంది. దీనివల్ల ఇంజన్ మెరుగుపడటంతో పాటు స్పీడ్ తో పాటు స్మూత్ నెస్ కూడా వాహనానికి వస్తుంది. అంతేకాకుండా బోలెడు ప్రయోజనాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా బండి మన్నిక కూడా చాలా వరకు పెరుగుతుంది. ఇదివరకు కంటే మీ వాహనం మైలేజ్ కూడా ఎక్కువగా ఇస్తుంది.
ఇక తేడాల గురించి మాట్లాడితే ఎక్స్ పీ పెట్రోల్ ఎక్కువ ఆక్టేన్ కలిగి ఉంటుంది. సాధారణ పెట్రోల్ లో ఆక్టేన్ రేటింగ్ 87 ఉండగా, మిడ్ గ్రేడ్ పెట్రోల్ లో ఆక్టేన్ వాల్యూ 88 నుంచి 90 దాకా ఉంటుంది. ప్రీమియం లేదా పవర్ పెట్రోల్ లో మాత్రం ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. 91 నుంచి 94 దాకా ఆక్టేన్ ఉంటుంది అని నిర్వాహకులు చెబుతున్నారు.
ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉన్న పెట్రోల్ వల్లనే అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పటినుంచి అయినా సేల్స్ ఎక్కువగా ఉండే పెట్రోల్ బంక్ కి వెళ్ళినప్పుడు మీ వాహనానికి మీరు కొట్టించే పెట్రోల్ ఏంటి అనేది కూడా అడగండి. ఇక అడిగి మరీ ఆక్తేన్ రేటింగ్ ఎక్కువగా ఉన్న పెట్రోల్ ని మీ వాహనాల్లో కొట్టించండి. మీ వాహనంలో వచ్చే మంచి మార్పులు మీరే గమనిస్తారు.
Also Read: WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?
Also Read: Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి