High Uric Acid: అధిక యూరిక్ యాసిడ్ సమస్యలకు చెక్..ఇప్పుడే ఈ పాలు తాగండి..
High Uric Acid: అధిక యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల ఆహారాలను చేర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం కూడా ఈ యాసిడ్ సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
High Uric Acid: అధిక యూరిక్ యాసిడ్ కారణంగా చాలామందిలో ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని ఇటీవల నివేదికల్లో పేర్కొన్నారు. యూరిక్ యాసిడ్ కారణంగా కిడ్నీ సంబంధిత సమస్యలు, చేతుల్లో వాపు, కీళ్ల సమస్యలు, పాదాల్లో నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు చిట్కాలను పాటించాల్సి అవసరం ఎంతగానో ఉంది. అయితే యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి పసుపు ప్రభావంతంగా పనిచేస్తుంది. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాలు యూరిక్ యాసిడ్ ను తగ్గించడానికి సహాయడుతుంది.
యూరిక్ యాసిడ్ తగ్గించుకోవడానికి ఇలా చేయండి:
పసుపులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. కాబట్టి దీనిని వంటకాల్లో వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ లక్షణాలు యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ పసుపును పాలలో కలుపుకుని తాగండి.
ఇలా ఇంటి నివారణాలు కూడా పని చేస్తాయి:
>>యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు నీరును అధిక పరిమాణంలో తాగాల్సి ఉంటుంది. నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, యూరిక్ యాసిడ్ బయటకు పోతుంది.
>>తీపి, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు తినకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని అతిగా తినడం వల్ల యూరిక్ యాసిడ్‌తో పాటు మధుమేహానికి కారణమయ్యే ఫ్రక్టోజ్ పెరుగుతుంది.
>>యూరిక్ యాసిడ్ తగ్గడానికి గ్రీన్ టీ కూడా సహాయపడుతుంది. అయితే ఈ సమస్యతో బాధపడేవారు ప్రతి రోజూ రెండు సార్లు తాగాల్సి ఉంటుంది.
>>ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, బీన్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
>>అధిక ఫైబర్ ఆహారాలు కూడా యూరిక్ యాసిడ్ తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి ప్రతి రోజూ ఓట్స్, యాపిల్, జామ మొదలైన వాటిని తినవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
>>ఆహారంలో నారింజ, నిమ్మకాయలు, బెర్రీలు వంటి విటమిన్ సి అధికంగా ఉండే వాటిని చేర్చండి.
Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి